డిసెంబర్ 7న తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం

Finally Revanth Reddy is crowned,Revanth Reddy is crowned,Finally Revanth Reddy,T CM Revanth Reddy, Revanth Reddy,Telangana CM, oath on December 7,Uttam Kumar Reddy, Paleru MLA Ponguleti Srinivasa Reddy, Mallu Bhatti Vikramarka, Komati Reddy Venkat Reddy,Mango News,Mango News Telugu,Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates,MLA Ponguleti Srinivasa Reddy Latest News,Mallu Bhatti Vikramarka Latest Updates,Telangana Politics,Telangana Elections Latest Updates,Telangana Latest News And Updates
T-CM Revanth Reddy, Revanth Reddy,Telangana CM, oath on December 7,Uttam Kumar Reddy, Paleru MLA Ponguleti Srinivasa Reddy, Mallu Bhatti Vikramarka, Komati Reddy Venkat Reddy

ఎట్టకేలకు కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డినే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడంతో..సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్  7న ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డిసెంబర్ 5,  6 తేదీలతో ప్రమాణ స్వీకారోత్సవానికి మంచిరోజులు కాకపోవడంతో..ఈనెల 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదేరోజు తెలంగాణ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రజాకర్షణతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పనితీరు ఆధారంగానే ముఖ్యమంత్రిగా ఆయన అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సీఎల్పీ నేతతో పాటు ముఖ్యమంత్రి ఎంపిక కార్యక్రమంలో భాగంగా.. కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో డిసెంబర్ 4న  హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్‌, మురళీధరన్‌, దీపాదాస్‌ మున్షీ, అజేయ్‌కుమార్‌, జార్జ్‌ సమావేశమయ్యారు. ముందుగా కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు, సహకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు  ధన్యవాదాలు తెలుపుతూ..ఈ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ..సీఎల్పీ నేతను నిర్ణయించే అధికారాన్నిఅప్పగిస్తూ   తీర్మానాన్ని.. సీఎల్పీ సమావేశం ఆమోదించింది.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ వంటి సీనియర్ నేతలు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా..మిగిలిన  సభ్యులు ఆమోదించారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్న విషయంపై.. ప్రతి ఎమ్మెల్యేతో ఏఐసీసీ పరిశీలకులు ముఖాముఖి సమావేశం అయి..వారి  అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేకాదు ఈ సమయంలో నేతలందరి  అభిప్రాయాలను కూడా నోట్‌ చేసుకున్నారు. అయితే  రేవంత్‌రెడ్డిని సీఎంగా కోరుకుంటూ కేవలం 25మంది మాత్రమే చెప్పారు. రేవంత్‌ రెడ్డితో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, పాటు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు కూడా ఎమ్మెల్యేల నుంచి వచ్చాయి.

దీంతో మరోసారి కాంగ్రెస్‌కు చిక్కు ప్రశ్నే ఎదురయినట్లు అయింది. చివరకు సోమవారం సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో డీకే శివకుమార్‌ , మిగిలిన ఏఐసీసీ పరిశీలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు వారంతా మల్లికార్జున ఖర్గేను కలిసి ఎమ్మెల్యేల అభిప్రాయాలను వివరించనున్నారు.దీంతో కాంగ్రెస్  అధిష్ఠానం ఈరోజు సాయంత్రం లోగా తెలంగాణ ముఖ్యమంత్రిపై తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది.

ముందుగా సోమవారం సాయంత్రం..ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి  తగినట్లుగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ, పోలీసు శాఖలు తగిన ఏర్పాట్లు కూడా చేసేశాయి. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్న సమాచారంతో టెంట్లు, కుర్చీలు, స్టేజీ వంటివి సిద్ధం చేశారు.

కానీ సీఎం ఎవరు అనేదానికి అప్పటికి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అటు సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ సమావేశమయ్యారు కానీ ఎన్నిక మాత్రం జరగలేదు. చివరకు సీఎల్పీ నేతను ఎంపిక చేసే అధికారాన్ని కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వదిలేస్తూ సమావేశం ఏకవాక్య తీర్మానం చేసింది. దీంతో సోమవారం జరుగుతుందనుకున్న సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడి ఈనెల 7న ఫిక్స్ అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 19 =