ఢిల్లీలో అధికార నివాసం ఖాళీ చేయనున్న కేసీఆర్

KCR will vacate the official residence in Delhi,KCR will vacate the official residence,Official residence in Delhi,KCR will vacate in Delhi,ktr, brs, pragathi bhavan, delhi, house,Mango News,Mango News Telugu,KCR Is Vacating His Official Residence,KCR House In Delhi,KCR Delhi Residence,KCR Vacating His House,KCR Lastest News,KCR Residence Latest News,KCR Residence Latest Updates
ktr, brs, pragathi bhavan, delhi, house

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రికొ కొడుదామనుకున్న కేసీఆర్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. తాజా ఫలితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వమే గద్దె దిగిపోయింది. దీంతో తన పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ప్రగతి భవన్‌ను వీడి బయటకొచ్చేశారు. ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న భవంతిని ఖాళీ చేసేశారు. అయితే తాజా ఓటమితో ప్రగతి భవన్‌తో పాటు ఢిల్లీలోని తన అధికార నివాసంతో కూడా కేసీఆర్‌కు అనుబంధం తెగిపోయింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో 20 ఏళ్లుగా అనుబంధం ఉన్న తన ఇంటిని కూడా కేసీఆర్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. కేసీఆర్‌కు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన క్వార్టర్.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

2004లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో కేసీఆర్‌కు కేంద్ర మంత్రి హోదాలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో క్వార్టర్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలుపొందారు. దీంతో మళ్లీ అదే క్వార్టర్‌లో కేసీఆర్ ఉన్నారు.

ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో మళ్లీ అదే క్వార్టర్‌లో కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక కేసీఆర్ 2014 లో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర ప్రభుత్వం క్వార్టర్‌ను కేటాయించినట్లుగానే.. కేసీఆర్‌కు కూడా అదే క్వార్టర్‌ను తిరిగి కేటాయించింది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావడంతో.. ఆ క్వార్టర్ అలానే ఉండిపోయింది.

దాదాపు ఆ క్వార్టర్‌తో కేసీఆర్‌కు 20 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కేసీఆర్ ఢిల్లీలోని తన అధికారికి నివాసాన్ని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే అధికారులు క్వార్టర్ ఖాళీ చేయాలని ఆదేశించారట. రెండు, మూడు రోజుల్లో తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + twelve =