టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. ప్లీనరీ సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటుపై రూ. 10 లక్షల ఫైన్

GHMC Imposes Fine Upto Rs 10 Lakh on TRS Flexis in Hyderabad City During Plenary, During Plenary GHMC Imposes Fine Upto Rs 10 Lakh on TRS Flexis in Hyderabad City, GHMC Imposes Fine Upto Rs 10 Lakh on TRS Flexis in Hyderabad City, TRS Flexis in Hyderabad City, GHMC Imposes Fine Upto Rs 10 Lakh, GHMC imposes fines Rs 10 Lakh on TRS leaders over TRS plenary, Greater Hyderabad Municipal Corporation, Greater Hyderabad Municipal Corporation Imposes Fine Upto Rs 10 Lakh To TRS leaders over TRS plenary, TRS plenary, TRS plenary News, TRS plenary Latest News, TRS plenary Latest Updates, TRS plenary Live Updates, TRS Flexis, Mango News, Mango News Telugu,

టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిన్న పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు రూ. 10 లక్షల ఫైన్ విధించింది. ఈ క్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్ తో పాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలపై భారీగా జరిమానా విధించింది. నిన్న నగరంలో జరిగిన టీఆర్‌ఎస్‌ 21వ ప్లీనరీ సందర్భంగా నగరమంతటా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు, కటౌట్‌లు ఏర్పాటు చేసినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. కనీస జరిమానాగా 5 వేల నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాటు చేసిన అనధికార బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాల ఫొటోలను నెటిజన్లు పోస్ట్ చేయడంతో సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ (సీఈసీ) గురువారం నుంచి ఈ-చలాన్‌లను రూపొందించడం ప్రారంభించింది. చాలా మంది పౌరులు ట్విట్టర్‌లో కూడా ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హైదరాబాద్‌ను ‘పింక్‌ సిటీ’గా మార్చడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. దీనిపై గతంలో హైకోర్టు కూడా స్పష్టంగా ఆదేశాలిచ్చిందని, ఇది పౌర నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా బీజేపీ మండిపడ్డాయి. అనేక ప్రదేశాల్లో భారీ బ్యానర్లు పేవ్‌మెంట్‌లను బ్లాక్ చేశాయని, దీని వలన పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులొచ్చాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. దీంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు టీఆర్‌ఎస్ నేతలపై భారీగా జరిమానా విధించినట్లు వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =