తెలంగాణలో మున్సిపల్ కార్యక్రమాలను ప్రశంసించిన తమిళనాడు అధికారుల బృందం

Tamil Nadu Govt Officials Team Meets Telangana CS and Appreciates State Municipal Programmes, Tamil Nadu Govt Officials Team Meets Telangana CS, Municipal Administration Department of Tamil Nadu Team Meets Telangana CS and Appreciates State Municipal Programmes, State Municipal Programmes, Municipal Administration Department of Tamil Nadu, Tamil Nadu Municipal Administration Department, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary, Tamil Nadu Govt Officials Team Appreciates Telangana State Municipal Programmes, Telangana State Municipal Programmes, Telangana State Municipal Programmes News, Telangana State Municipal Programmes Latest News, Telangana State Municipal Programmes Latest Updates, Telangana State Municipal Programmes Live Updates, Tamil Nadu Govt Officials, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మున్సిపల్ కార్యక్రమాలను తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత స్థాయి అధికారుల బృందం ప్రశంసించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. బుధవారం సాయంత్రం బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను తమిళనాడు అధికారుల బృందం కలిసింది. తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, మంచినీటి సరఫరా శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ శివ దాస్ మీనా, గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్, ముఖ్య కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ, జాయింట్ సెక్రెటరీ జాన్ లూయిస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పొన్నయ్య, చెన్నై కార్పొరేషన్ సీనియర్ అధికారులు సీఎస్ సోమేశ్ కుమార్ ను కలసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్బంగా తమిళనాడు అడిషనల్ సీఎస్ శివ దాస్ మీనా మాట్లాడుతూ, వ్యర్థపదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనా రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రశంసించారు. ప్రధానంగా జవహర్ నగర్ లో శాస్త్రేయ పద్దతిలో డంప్ యార్డ్ నిర్వహణ, వ్యర్థాలనుండి విద్యుత్ తయారీ, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు, స్వచ్ఛ్ ఆటోల వినియోగం, స్వచ్ఛ్ కార్యక్రమాలను పరిశీలించామని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో మున్సిపల్ రంగంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని వివరించారు. వీటిలో ప్రధానంగా ఇంటింటికి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణకై స్వచ్ఛ ఆటోలను ప్రవేశ పెట్టడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో శాస్త్రేయ పద్దతుల అమలు, వేస్ట్ టూ ఎనేర్జి ప్లాంట్ల ఏర్పాటు, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్, ఆస్తిపన్ను మదింపు, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి తదితర ఎన్నోవినూత్న పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం, జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ సంతోష్ ఆధ్వర్యంలో నగరంలో అమలవుతున్న పలు మున్సిపల్ కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =