ఓయూ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థినుల ఆందోళన

Mango News, Girl Students Protest In Front Of Hostel In Osmania University, Osmania University Student Protest In Front Of Hostel, Osmania University student protest, Protests erupt at Hyderabad Osmania University, Women's College student protest For Security

ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ లో తమకు రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గురువారం తెల్లవారుజామున ఇంజనీరింగ్ విద్యార్థినుల హాస్టల్ లో గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించి హల్ చల్ చేసాడు. హాస్టల్ లో ప్రవేశించి ఒక అమ్మాయిని కత్తితో బెదిరించి తీవ్ర భయాందోళనకు గురి చేసాడు. బాధితురాలు, గదిలోని ఇతర అమ్మాయిలు గట్టిగ అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

హాస్టల్ వద్ద సరైన భద్రతా సౌకర్యాలు లేకపోవడం వలనే ఇటువంటి ప్రమాదకర సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ రోజు విద్యార్థినులు, ఇతర విద్యార్థి సంఘాలతో కలిసి హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. జరిగిన సంఘటనపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. హాస్టల్ ప్రహారీగోడ ఎత్తుని పెంచి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, రాత్రి వేళల్లో మహిళా గార్డులతో భధ్రత కలిపిస్తామని చెబుతున్నారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=aBsSV4fFu8M]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 1 =