కాళేశ్వరం చూడండి.. మేము కట్టించిన ప్రాజెక్టులు చూడండి: రాహుల్ గాంధీ

See Kaleswaram See the projects we have built says rahul gandhi,See the projects we have built,See Kaleswaram we have built,rahul gandhi projects,Mango News,Mango News Telugu,congress, rahulgandhi, rahul gandhi comments, telangana assembly elections,Telangana Congress,Telangana Congress Latest News,Telangana Congress Latest Updates,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Assembly Elections Live News,Telangana Latest News and Updates, Telangana Political News and Updates
congress, rahulgandhi, rahul gandhi comments, telangana assembly elections

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు గులాబీ బాస్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేపడుతుంటే.. ఆ పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తీరిక లేకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి అగ్రనేతలను రంగంలోకి దింపి రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. అగ్రనేతలు ప్రచారాలు నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రత్యర్ధి పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఇటీవల బస్సు యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. కొల్లపూర్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం ఒక వైపు.. తెలంగాణ సమాజం, యువత, మహిళలు మరోవైపు ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజల తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏడాది కూడా కాకముందే.. కూలిపోయే పరిస్థితి వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభత్వ హయాంలో కట్టిన జూరాల, సింగూర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు కేసీఆరో దోచుకున్నారన్న రాహుల్ గాంధీ.. తాము అధికారంలోకి రాగానే ఆ సొమ్మును వెనక్కి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.

ధరణి పోర్టల్ తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దాదాపు 20 లక్షల మంది రైతులు, పేదల భూములను  లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుంగా గతంలో కాంగ్రెస్ ఇచ్చిన భూములను కూడా కబ్జా చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. భూములను తిరిగి అప్పగిస్తామని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =