కొత్త పురపాలక చట్టానికి సవరణలు చెప్పిన గవర్నర్ నరసింహన్

Governor Narasimhan Latest News, Governor Narasimhan Proposes Changes In New Municipal Act Bill, Mango News, Special session of Telangana Assembly to pass new Municipal Act, Telangana Assembly Live 2019, Telangana Assembly Passes Municipalities Bill to Check Illegal Constructions Land Grabs, Telangana passes new Municipal Act

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే రెండు రోజుల పాటు ప్రత్యేక శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసి నూతనంగా రూపొందించిన పురపాలక చట్టం బిల్లు ప్రవేశ పెట్టి, సభ్యులతో చర్చించి ఆమోదం తెలిపారు. శాసన సభ ఆమోదం తరువాత గవర్నర్ ఆమోదం కోసం పంపించారు, అయితే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పురపాలక చట్టం బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తీ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలనే నిబంధనను గవర్నర్ వ్యతిరేకించినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా కలెక్టర్లకు పూర్తీ స్థాయి అధికారాలు, ఇతర కొన్ని అంశాలపై కూడ ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అధికారికంగా బిల్లులో కొన్ని సవరణలు చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించారు, గవర్నర్ ఆదేశాల మేరకు సూచించిన సవరణలకు అంగీకరించి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. అసెంబ్లీ ప్రోరోగ్ అవ్వడం, ఇతర అంశాలను పరిశీలించిన ప్రభుత్వం వెంటనే సూచనలు అంగీకరించి ఆర్డినెన్సు జారీ చేసింది.

 

[subscribe]
[youtube_video videoid=cADFap0KTSY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 12 =