అమిత్ షా ను కలిసిన పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్

Peddapalli EX-MP Vivek Meets BJP President Amit Shah,Mango News,TRS Ex MP Vivek Joins BJP Soon in Presence of Amit Shah,Ex TRS MP to join BJP,Telangana Latest News,Telangana Political News,TRS Party Latest News

పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ని కలిశారు. నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై ఫిర్యాదు చేసారు, ప్రస్తుత సచివాలయంలోని భవనాలను, అసెంబ్లీ నిర్మాణం కొరకు ఎర్రమంజిల్ లో పురాతన కట్టడాలను కూల్చివేతకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వెంటనే ఆపాలని హోమ్ మినిస్టర్ అమిత్ షా ను కోరారు. ప్రభుత్వం విలువైన భవనాలను కూల్చేయడం ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం వెంటనే జ్యోక్యం చేసుకోవాలని కోరారు. ఇటీవలే తెలంగాణలోని విపక్ష పార్టీ నేతలతో కలిసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ని కూడ కలిసి భవనాల కూల్చివేత పై వివేక్ వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.

అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో కలిసి అమిత్ షా ను కలవడంతో, ఈ రోజే వివేక్ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికలలో తెరాస పార్టీ తనకు ఎంపీ టికెట్ నిరాకరించిన తరువాత, అసంతృప్తి తో టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసారు. కొద్దీ రోజుల నుండి బీజేపీ నాయకులతో టచ్ లో ఉండి, బీజేపీ లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే వచ్చే నెలలో బీజేపీ పార్టీలో చేరాలని వివేక్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

 

[subscribe]
[youtube_video videoid=u8Kbptl1FeQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eleven =