తెలంగాణకు 16 కోట్ల పారాసెటమాల్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన గ్రాన్యూల్స్‌ ఇండియా

Granules India Contributed 16 Crore Paracetamol Tablets Worth of Rs.8 Crore to Telangana,Mango News,Mango News Telugu,Granules Pledges 16 Crore Paracetamol Tablets To Telangana Government,COVID-19,Granules Pledges 16 Crore Paracetamol Tablets,Granules India Contributed 16 Crore Paracetamol Tablets,Paracetamol Tablets,Granules India Commits To Donate 16 Crore Paracetamol Tablets To Telangana,Granules,India,Granules India,16 Crore Paracetamol Tablets,Telangana,Lockdown In Telangana,Telangana Covid-19 Updates,Telangana Coronavirus Updates,Telangana,Telangana News,Granules To Provide 16 Cr Paracetamol Tablets,Granules India To Donate 16 Crore Paracetamol Tablets to Telangana,16 Crore Paracetamol Tablets to Telangana,Granules India Donation

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించేందుకు పలుసంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.8 కోట్ల విలువైన 16 కోట్ల పారాసెటమాల్ టాబ్లెట్లను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించింది. రాబోయే 4 నెలల్లో ప్రతి వారం 1 కోటి పారాసెటమాల్ టాబ్లెట్లను కంపెనీ ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సాయం అందించేందుకు ముందుకొచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, మున్సిపల్ మంత్రి కె.టి.రామారావు ప్రశంసించారు.

బుధవారం నాడు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమాదేవి చిగురుపాటి బిఆర్‌కెఆర్ భవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసి మొదటివారంకు సంబంధించిన పారాసెటమాల్ టాబ్లెట్ల విరాళాన్ని అందజేశారు. ఔషధ తయారీ సంస్థ అయిన గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్స్ కలిగిఉండగా, దేశంలో 6 మరియు విదేశాల్లో ఒక ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. సామాజిక బాధ్యతలో భాగంగా కరోనా మహమ్మారి కట్టడికి వారు చేసిన కృషి ఎంతో ప్రశంసించదగినదని పేర్కొన్నారు. గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిసిన కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =