తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు అందించిన తెలుగు సినీ ప్రముఖులు

CM KCR, Heavy Rainfall In Hyderabad, Heavy Rains in Hyd, Heavy Rains In Hyderabad, Hyderabad Rains, Hyderabad Rains news, hyderabad weather, hyderabad weather report, Rains In Hyderabad, telangana, Telangana CM Relief, Telangana rains, telangana rains news, telangana rains updates, Tollywood Stars and Celebrities Donated to Telangana CM Relief Fund

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.550 కోట్లు విడుదల చేసి, నగరంలో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు సాయంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు బాధితులను ఆదుకునేందుకు పెద్దఎత్తున విరాళాలు అందిస్తున్నారు. నటులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దర్శకులు హరీష్ శంకర్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి తదితరులు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు.

వరదలు నేపథ్యంలో ప్రభుత్వానికి విరాళం ప్రకటించిన తెలుగు సినీ ప్రముఖులు:

  • చిరంజీవి: రూ. 1 కోటి
  • మహేష్ బాబు: రూ. 1 కోటి
  • అక్కినేని నాగార్జున : రూ. 50 లక్షలు
  • జూ. ఎన్టీఆర్: రూ. 50 లక్షలు
  • విజయ్ దేవరకొండ : రూ. 10 లక్షలు
  • త్రివిక్రమ్: రూ. 10 లక్షలు
  • హరీష్ శంకర్ : రూ. 5 లక్షలు
  • అనిల్ రావిపూడి : రూ. 5 లక్షలు
  • హారికా హాసిని క్రియేషన్స్: రూ. 10 లక్షలు

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =