ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన నేతల వివరాలు

MLAs, MLAs have crossed Rs.100 crores, MLAs have crossed Rs.100 crores, Forum for Good Governance,Ponguleti Srinivas Reddy, Komatireddy Rajagopal Reddy, Kumbham Anil Kumar Reddy, Bellampally MLA Gaddam Vinod, Bodhan MLA Podduthuri Sudarshan Reddy, Former CM KCR, KTR, Komatireddy Venkat Reddy, Telangana News Updates, Telangana Latest News, Mango News Telugu, Mango News
MLAs have crossed Rs.100 crores, Forum for Good Governance,Ponguleti Srinivas Reddy, Komatireddy Rajagopal Reddy, Kumbham Anil Kumar Reddy, Bellampally MLA Gaddam Vinod, Bodhan MLA Podduthuri Sudarshan Reddy, Former CM KCR, KTR, Komatireddy Venkat Reddy

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లు చాలామందే ఉన్నా వారిలో రూ.100కోట్లు దాటిన వారు ఎక్కువ మందే ఉన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67కోట్లతో మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

అలాగే గడ్డం వివేకా తర్వాత పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.461.05కోట్లుతో రెండో స్థానంలో ఉండగా ,  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.458.39కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అలాగే నాలుగో స్థానంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.211.84కోట్లతో ఉండగా.. ఐదో స్థానంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రూ.197.12కోట్లు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రూ.109.97కోట్లుతో ఆరోస్థానంలో ఉన్నట్లు పద్మనాభరెడ్డి వెల్లడించారు.

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌కు రూ.58,93కోట్లు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రూ. 53.31కోట్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రూ.39.55కోట్లు ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి  పేర్కొన్నారు. అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు రూ.24లక్షలతో అత్యంత పేదవారుగా ఉన్నారు. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కు రూ.28లక్షలు మాత్రమే ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు.

అదేవిధంగా  తాజాగా జరిగిన అసెంబ్లీ  ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో పీహెచ్ డీ చేసిన వాళ్లు నలుగురు మాత్రమే ఉన్నట్లు పద్మనాభరెడ్డి చెప్పారు. పోస్టు గ్రాడ్యుయేట్లు 27మంది కాగా, గ్రాడ్యుయేట్లు 42మంది ఉన్నారని.. గ్రాడ్యుయేషన్ కంటే కూడా తక్కువ చదివినవారు 46 మంది ఉన్నారు. అంతేకాదు 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైన, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన క్రిమినల్ కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నట్లు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =