టికెట్ నిరాకరించిన జగన్.. జనసేనలో చేరేందుకు సిద్ధమయిన వైసీపీ ఎమ్మెల్యే

Jagan, Janasena YCP MLA, Janasena, Jagan Refused a Ticket, Janasena, YCP MLA, Gudur MLA Varada Prasad, Pawan kalyan, Denied tickets, 3 YSRC MLAs looking for defection, S Jagan Mohan Reddy, YSRCP, AP Politics, Mango News Telugu, Mango News
Janasena, YCP MLA, Gudur MLA Varada Prasad, Pawan kalyan

ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తి సెగలుగక్కుతోంది. పెద్ద సంఖ్యలో అసంతృప్తులు వైసీపీకి పంగనామాలు పెట్టేస్తున్నారు. జనసేన, తెలుగు దేశం పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. జనసేనానిని కలిశారు. త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గానికి వైసీపీ నేత వెలగపల్లి వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వరప్రసాద్‌కు టికెట్ నికారించారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. వెలగపల్లి వరప్రసాద్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్. 2009లో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి తన పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున తిరుపతి నుంచి వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగావున్న వరప్రసాద్.. 2014లో ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ‌ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో వరప్రసాద్‌కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి బరిలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరప్రసాద్ గూడూరు నుంచి గెలుపొందారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కొద్దిరోజులుగా ఆయన పనితీరు బాగాలోదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు హైకమాండ్ చేయించిన సర్వేల్లో కూడా అదే తేలిందట.

దీంతో ఈసారి వరప్రసాద్‌ను వైసీపీ హైకమాండ్ సైడ్ చేసింది. ఆయన స్థానంలో గూడూరు నుంచి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ను బరిలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన జాబితాలో కూడా మేరిగ మురళీధర్ పేరే ఉంది. దీంతో వరప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో పార్టీ మారేందుకు సిద్ధమయిన వరప్రసాద్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. తాను జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వరప్రసాద్ తిరుపతి ఎంపీ టికెట్ అడిగారట. అయితే దీనిపై వరప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీలో చేర్చించిన తర్వాతే తమ నిర్ణయం చెబుతామని అన్నారట. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుందో.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =