ఆర్టీఏలో కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్ సహా 6 ఆన్‌లైన్‌ సేవలు

6 New Online Services Introduced in Telangana RTA, key RTA services go online, New Online Services Introduced in Telangana RTA, Telangana RTA, Telangana RTA expands online services, Telangana RTA online services, Telangana Transport, Telangana transport department, Telangana Transport Minister

రవాణా శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు  చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై 24 న 5 రకాల రవాణా సేవలు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా సెప్టెంబర్ 2, బుధవారం నుంచి మరో ఆరు రకాల ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవల కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండానే ఇంటి వద్దనుంచే ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఓ‌ ప్రకటనలో వెల్లడించారు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, పదే పదే ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. రవాణా శాఖలో మరికొన్ని ఆన్‌లైన్‌ సేవలను కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆర్టీఏలో అందుబాటులోకి వచ్చిన 6 ఆన్‌లైన్‌ సేవలు:

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్ రెన్యూవల్
  • ప్రమాదకర పదార్ధాలు రవాణా చేసే వాహనాల లైసెన్స్‌ ధ్రువీకరణ
  • గడువు పూర్తైన లెర్నర్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్త లెర్నర్‌ లైసెన్స్
  • గడువు పూర్తైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం లెర్నర్‌ లైసెన్స్‌
  • డ్రైవింగ్ లైసెన్స్ అప్ గ్రేడ్ ( టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ – లెర్నర్ లైసెన్స్)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 16 =