హైదరాబాద్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ

Hyderabad Assam CM Himanta Biswa Sarma Visits Charminar Bhagya Laxmi Temple Today, Assam CM Himanta Biswa Sarma , CM Himanta Biswa Sarma Visits Charminar Bhagya Laxmi Temple, Assam CM Visits Bhagya Laxmi Temple, Assam CM Slams Telangana Family Rule, Assam CM Latest News And Updates, Assam CM, CM Himanta Biswa Sarma, Charminar Bhagya Laxmi Temple, CM Himanta Biswa Sarma Hyd Tour, Bhagya Laxmi Temple Hyderabad, Charminar News And Live Updates

అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ హైదరాబాద్ పర్యటనకు విచ్చేసారు. గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రసిద్ధ శ్రీ శ్యామ్ మందిర్‌ మరియు చార్మినార్‌ వద్ద గల భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు. ‘భగవాన్ శ్రీ కృష్ణుడిని ఆశీర్వాదం కోసం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ శ్యామ్ మందిర్‌ సందర్శించాను. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థించాను’ అని సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ తెలియజేశారు. అలాగే భాగ్యలక్ష్మీ ఆలయ సందర్శనపై కూడా ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్‌లోని చారిత్రాత్మక శ్రీ భాగ్య లక్ష్మీ మందిర్‌లో ప్రార్థనలు చేసిన తర్వాత ఆశీర్వదించబడిన అనుభూతి కలిగింది. అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి మరియు శ్రేయస్సు కోసం నేను అమ్మవారిని ప్రార్థించాను’ అని సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అనంతరం సీఎం హిమంత గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా గణేశ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో మొజాంజాహీ (ఎంజే) మార్కెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపైన ఆయ‌న‌ మాట్లాడుతూ. గణేష్ ఉత్సవాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగించిందని విమ‌ర్శించారు. అలాగే సీఎం కేసీఆర్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్య‌ల‌పై అభ్యంతరం తెలిపిన గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ సీఎం హిమంత నుంచి మైక్ ను లాక్కున్నాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మ‌ధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే అప్రమతమైన పోలీసులు నందు బిలాల్ ను అక్కడి నుండి తరలించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. నందు బిలాల్ అనుచరులు, టీఆర్ఎస్‌ మహిళా నేత‌లు అడ్డుకున్నారు. దీంతో మహిళా పోలీసులను రంగంలోకి దింపి ఆందోళనకు దిగిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 8 =