బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పున:ప్రారంభం

Biodiversity Flyover Reopened, Hyderabad Biodiversity Flyover, Hyderabad Biodiversity Flyover Reopened, Mango News Telugu, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana Political Updates, Telangana Political Updates 2020

గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై నవంబర్ 23న జరిగిన కారు ప్రమాద ఘటన తర్వాత ఫ్లైఓవర్‌ ను తాత్కాలికంగా మూసివేస్తూ, ప్రమాదంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 4, శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తిరిగి ప్రారంభించారు. ముందుగా నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఫ్లైఓవర్ పై చేపట్టిన అదనపు భద్రతా చర్యలను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీపీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలించారు. పూర్తీ పరిశీలన అనంతరం ఫ్లై ఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు.

ప్రమాదాలను నివారించే భద్రతా చర్యల్లో భాగంగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 1200కు పైగా రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే 12 చోట్ల స్పీడ్‌ బ్రేకర్లుగా రంబుల్‌ స్ట్రిప్స్‌ వేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు సూచించే సైన్‌ బోర్డులు ఏర్పాటుతో పాటుగా ఈ ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ లిమిట్‌ 40 కి.మీ అని తెలియజెప్పేలా రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు వేశారు. నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు పూర్తిస్థాయి భద్రతా చర్యలు చేపట్టిన అనంతరం 42 రోజులు తరువాత ఈ ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలు పున:ప్రారంభం అయ్యాయి.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seventeen =