సెప్టెంబర్ 13న మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం

CM KCR to Held Preparatory Meeting over Dalit Bandhu Scheme on September 13th, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Updates, KCR to Held Preparatory Meeting over Dalit Bandhu Scheme, Mango News, Preparatory Meeting over Dalit Bandhu Scheme, Telangana CM calls meeting on implementation of Dalit Bandhu, Telangana CM calls meeting on implementation of Dalit Bandhu Scheme, Telangana CM to convene a meeting on Dalit Bandhu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సన్నాహక సమావేశం సెప్టెంబర్ 13, సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.

సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజకవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =