గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్ మెట్రో రైల్ పనివేళలు పొడిగింపు

Hyderabad Metro Rail Train Services Working Time Extends in View of Ganesh Immersion on SEP 9, Ganesh Immersion on SEP 9, Hyderabad Metro Rail Train Services Working Time Extends, Hyderabad Metro to extend train services, Hyderabad Metro Rail Timings Extended Till 2AM, Hyderabad Metro Rail Train Services, Hyderabad Metro Rail Timings, Ganesh Immersion, Telangana Ganesh Immersion, Hyderabad Metro Rail News, Hyderabad Metro Rail Latest News And Updates, Hyderabad Metro Rail Live Update, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ నగరంలో రేపు (సెప్టెంబర్ 9, శుక్రవారం) గణేష్ నిమజ్జన శోభాయాత్రలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మెట్రో రైల్ సాధారణ పనివేళలలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

“రేపు సెప్టెంబర్ 9వ తేదీన నగరంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు జరగనున్న దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ రైలు సర్వీసులను సాధారణ పనివేళలకు మించి పొడిగించాలని నిర్ణయించాం. సాధారణ షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రైల్ సేవలు ప్రారంభమవుతాయి. ఇక చివరి మెట్రో రైలు సెప్టెంబరు 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు సంబంధిత స్టేషన్ల నుండి బయలుదేరుతుంది మరియు సంబంధిత టెర్మినేటింగ్ స్టేషన్‌లకు సుమారు 2 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణీకులు హైదరాబాద్ మెట్రో రైలు భద్రతా సిబ్బంది మరియు సిబ్బందికి సహకరించాలని అభ్యర్థిస్తున్నాం” అని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =