హైదరాబాద్‌ కస్తూర్బా కళాశాలలో విషవాయువు లీక్‌.. పలువురు విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Hyderabad Several Students Hospitalised After Suspected Toxic Gas Leak in Kasturba College,Kasturba College,Students Hospitalised Toxic Gas Leak,Toxic Gas Leak in Kasturba College,Mango News,Mango News Telugu,Toxic Gas Leak,Hyderabad Students Hospitalised,Students Hospitalised in Toxic Gas Leak,Hyderabad Kasturba College,Kasturba College Toxic Gas Leak,Toxic Gas Leak Incident,Toxic Gas Leak Hyd Latest News And Updates,Hyderabad News And Updates

హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా కళాశాలలో విషవాయువు లీక్ కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం సైన్స్ ల్యాబ్‌లో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో అక్కడ ఉన్న విద్యార్థినులు తలనొప్పి, వాంతులు, కళ్ళ మంటలు, ఊపిరి అందక పోవడం వంటి సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అయ్యారని సహచర విద్యార్థినులు తెలిపారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన యాజమాన్యం వారిని హుటాహుటిన గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మరికొందరిని కాలేజీకి దగ్గరలోని గీతా నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారు. ఇక దీనిపై అడిషనల్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సైన్స్ ల్యాబ్‌లో ఒక్కసారిగా విషవాయువు లీక్ అయిందని, దీంతో అక్కడే ఉన్న విద్యార్థినులు ఊపిరి అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం దాదాపు 15 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారని, అయితే ఇది గ్యాస్ లీకేజీనా లేక మరేదైనా సమస్యా అనే కోణంలో విపత్తు నిర్వహణ బృందం దర్యాప్తు చేస్తోందని వివరించారు. ఇక ప్రస్తుతం కళాశాలలో పరిస్థితి అదుపులో ఉందని ఆయన చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 8 =