పువ్వాడ‌కు గెలుపుపై ధీమా.. కార‌ణం ఇదేనా..?

Is this the reason why Puvvada is confident of winning,why Puvvada is confident,Puvvada is confident of winning,Is this the reason,Mango News,Mango News Telugu,brs, cm kcr, puvvada ajay, khammam politics, telangana assembly elections,Puvvada Latest News,Puvvada Latest Updates,Puvvada Live News,khammam politics Latest News,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
brs, cm kcr, puvvada ajay, khammam politics, telangana assembly elections,

బీఆర్ ఎస్ కోరిన టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం.. స‌వాల్ చేసి కాంగ్రెస్ లోకి రావ‌డం.. వంటి కార‌ణాల‌తో ఎలాగైనా గెలిచి తీరాల‌ని ఆ పార్టీ అభ్య‌ర్థి, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న న‌ల‌బై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వాన్ని అంతా రంగ‌రిస్తున్నారు. ఎన్న‌డూలేని రీతిలో ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. మ‌రోవైపు అన్ని ర‌కాలుగానూ ఆయ‌న‌కు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వంటి వారి స‌హ‌కారమూ ఉంది. అయిన‌ప్ప‌టికీ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి, మంత్రి పువ్వాడ అజ‌య్ హ్యాట్రిక్ నూ ధీమాగా ఉన్నారు. ఇందుకు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అందులో ప్ర‌ధానంగా ఆయ‌న చేసిన అభివృద్ధి, మంత్రిగా జిల్లాల‌కు అందిస్తున్న సేవ‌లు.. మ‌రోవైపు కేసీఆర్ అండ‌దండ‌లతో గెలుపుపై ఆయ‌న న‌మ్మ‌కంగా ఉన్నారు.

అజ‌య్‌కు క‌లిసొచ్చే అంశాలు..

ఖమ్మం జిల్లా ఉద్య‌మాల గ‌డ్డ‌. పోరాటాల చరిత్ర. క‌మ్యూనిస్టుల ప్ర‌భావం ఉంది. ఈ నేప‌థ్యం అజ‌య్ కు క‌లిసి రానుంది. ఆయ‌న తండ్రి పువ్వాడ నాగేశ్వ‌ర‌రావు క‌రుడుగ‌ట్టిన క‌మ్యూనిస్టు నాయ‌కుడు. సీపీఐ అగ్ర నాయ‌కులు. రాష్ట్రమంతా ఆ పార్టీ ఎటువైపు ఉన్నా.. ఖ‌మ్మంలో పార్టీ శ్రేణులు ఆజ‌య్ కు మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంది. దీంతో పాటు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో దూసుకెళ్తోంది. దాని వెనుక అజ‌య్ కృషి ఉంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయి. ఆయ‌న స‌మ‌కారంతో.. మంత్రి పువ్వాడ చొరవతో తొమ్మిదేండ్లలో వేల కోట్ల పనులు జరిగాయి. రూ. 4 కోట్లతో లకారం చెరువు సుందరంగా ముస్తాబైంది. 84వేల గృహాలకు స్వచ్ఛ తాగునీరందుతున్నది. నిరుపేదల కోసం 1210 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించింది. ఐటీ హబ్‌ మొదటి దశ పూర్తవగా, రెండో దశ నిర్మాణానికి రూ.36కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

అభివృద్ధి పైనే న‌మ్మ‌కం..

వాస్త‌వానికి ఖ‌మ్మం అభివృద్ధిలో మంత్రి పువ్వాడ ముద్ర ఉంది. ఆయ‌న ఆధ్వర్యంలో ఖమ్మం నగరపాలక సంస్థ ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. రూ. 4 కోట్లతో లకారం చెరువును సుందరీకరించారు. రూ. 100 కోట్లతో గోళ్లపాడు చానల్‌, రూ. 23 కోట్లతో నూతన మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాలను నిర్మించారు. మిషన్‌ భగీరథ అమృత్‌ పథకంలో రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నల్లాలు, 21,946 ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రూ. 70 కోట్లతో ధంసలాపురం ఆర్‌వోవీ బ్రిడ్జిని నిర్మించారు. ముస్తాఫానగర్‌ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశారు.

ఖమ్మం నగరంలోని నిరుపేదలకు టేకులపల్లి వద్ద 1,210 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించారు. వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాల్వలు, కూరగాయల మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ప్రజావసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చేందుకు రూ. 10 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎన్నెస్పీ క్యాంపులో రూ.25 కోట్లతో నూతన బస్‌స్టాండ్‌ ను నిర్మించారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తూ ఉద్యోగ వేటలో సుదూర ప్రాంతాలకు తరలివెళుతున్న ఖమ్మం యువత కోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘ఐటీహబ్‌’ను తీసుకువచ్చారు. రూ. 25 కోట్లతో మొదటి దశ నిర్మాణం పూర్తయ్యింది. మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రెండవ దశ నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు అయ్యాయి.

విప‌క్షాల అభ్య‌ర్థులు మాట‌ల ద్వారా ప్ర‌చారం చేస్తుంటే.. పువ్వాడ అజ‌య్ చేత‌ల ద్వారా తాను చేసిన అభివృద్ధిని చూపుతూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. అభివృద్ధిని చూసిన ప్ర‌జ‌లు ఆయ‌న తెలుపుతున్న మ‌ద్ద‌తుతో అజ‌య్ గెలుపుపై ధీమ‌గా ఉన్నారు. మ‌రోసారి గెలిపిస్తే తానేంటే చేస్తానో చెబుతూ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. అజ‌య్ కృషి ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + nineteen =