బీజేపీ-జనసేన మధ్య పొత్తు చిచ్చు..

The Alliance Between Bjp and Jana Sena,Alliance Between Bjp and Jana Sena,Bjp and Jana Sena,Mango News,Mango News Telugu,Bjp, Janasena, Pawan Kalyan, Kishan Reddy, Pm Modi, Telangana Assembly Elections,Bjp and Jana Sena Alliance,Ticket Clashes in Bjp with the Alliance of Janasena,Bjp & Pawan Kalyans Jana Sena Party,Bjp and Jana Sena Latest News,Bjp and Jana Sena Latest Updates,Bjp and Jana Sena Live News,Ap Politics,Ap Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
bjp, janasena, pawan kalyan, kishan reddy, pm modi, telangana assembly elections

ఎన్నికలొస్తే చాలు పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తుంటాయి. రెండు, మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి.. ప్రత్యర్థి పార్టీని ఓడించేందుకు పావులు కదుపుతుంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ.. పొత్తు రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తుంటే.. అటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా.. జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

బీజేపీ-జనసేనల పొత్తు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు పార్టీల మధ్య పొత్తు అంశం పక్కన పెడితే.. సీట్ల సర్దుబాటు విషయంలో అంతర్గత సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అమిత్ షా.. పవన్, కిషన్ రెడ్డిలకు సూచించారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక.. ఇద్దరు నేతలు సీట్ల సర్దుబాటు అంశంపై తేల్చుకునే పనిలో పడ్డారు. ఒక్కరోజులో సీట్ల సర్దుబాటు అంశం తేలిపోతుందని మొదట అంతా భావించారు.

అయితే బీజేపీ కేవలం 6 సీట్లు మాత్రమే ఇస్తామని చెబుతుంటే.. జనసేనాని మాత్రం 20 సీట్లు ఇవ్వాలని పట్టుబుడుతున్నారట. పొత్తు వ్యవహారం కంటే ముందే.. పవన్ కల్యాణ్ తెలంగాణలో 32 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పొడవడంతో.. కనీసం 20 స్థానాలు అయినా ఇవ్వాలని దీక్షించుకొని కూర్చున్నారట. అంతేకాకుండా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను కూడా తమకే ఇవ్వాలని.. జనసేనాని కోరుతున్నారట.

సాధారణంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో సీమాంధ్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పోటీ చేస్తే కలిసొస్తుందని జనసేనాని భావిస్తున్నారట. అయితే పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా స్థానాలు జనేసనకు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారట. స్థానిక బీజేపీ నేతలు కూడా జనసేనకు ఆయా స్థానాలు ఇవ్వొద్దని పట్టుబడుతున్నారట.

ఈ పరిణామాల మధ్య రెండు పార్టీల మధ్య పొత్తు పోయి.. అంతర్గత సమస్యలు తలెత్తుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ప్లస్ అవుతుందని భావించిన బీజేపీకి కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. మరి సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వస్తుందా? ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + seventeen =