తెలంగాణలో 8 స్థానాల నుంచి పోటీ చేయనున్న జనసేన

Jana Sena will contest from 8 seats in Telangana,Jana Sena will contest from 8 seats,contest from 8 seats in Telangana,Mango News,Mango News Telugu,telangana,telangana polls, pawan kalyans, jana sena,jana sena contest in 8 seats, Janasena candidates,pawan kalyan Latest News,pawan kalyan Latest Updates,pawan kalyan Live News,Jana Sena Latest News,Jana Sena Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News
telangana,telangana polls, pawan kalyans, jana sena,jana sena contest in 8 seats, Janasena candidates,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ అన్ని పార్టీలు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేస్తూ ఉంటే.. తెలంగాణలో బరిలో దిగుతున్న జనసేన మాత్రం ఇంకా పొత్తుల లెక్కల దగ్గరే ఆగిపోయిందన్న వార్తలకు జనసేనాని తాజాగా చెక్ పెట్టారు.  పొత్తు కంటే ముందే.. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేనాని ప్రకటించారు. ఆయా స్థానాల పేర్లను కూడా వెల్లడించారు. ఆ తర్వాత అనూహ్యంగా పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది.

పొత్తు గురించి కిషన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌తో సంప్రదింపులు జరపడం.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లడం చక చకా జరిగిపోయింది. ఒకటి రెండు రోజుల్లో రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అంతా భావించారు. అయితే  కనీసం 11నుంచి 20 సీట్లు అయినా ఇవ్వాలని జనసేనాని పట్టుపట్టుకొని కూర్చోగా. అటు బీజేపీ మాత్రం 6 నుంచి 8 సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చింది.  మొత్తంగా   రెండు పార్టీలు ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చి 8 సీట్లు జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమయింది. దీంతో మంగళవారం సాయంత్రం  జనసేన అభ్యర్థుల జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విడుదల చేశారు.

నవంబర్ 30 న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 8 స్థానాల్లో పోటీ చేస్తామని నవంబర్ 7న జనసేన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ కూటమి భాగస్వామిగా..జనసేన ఎన్నికల్లో పోటీ చేయనుంది. కూకట్‌పల్లి,  ఖమ్మం, తాండూరు, నాగర్ కర్నూల్,  కోదాడ, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) నుంచి పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.అయితే జనసేన శేరిలింగంపల్లి నుంచి తమ అభ్యర్థిని నిలబెడుతుందని వార్తలు వినిపించినా.. కూకట్‌పల్లిలోని 1 స్థానం నుంచి మాత్రమే పోటీ చేయబోతోంది.

కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్,  తాండూరు నుంచి వేమూరి శంకర్ గౌడ్ , కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి,  నాగర్ కర్నూల్ నుంచి  వంగ లక్ష్మ గౌడ్,  ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ ,  కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు,  వైరా నుంచి డాక్టర్ తేజావత్ సురేందర్ రావు,  అశ్వారావుపేట నుంచి ముయ్యబోయిన ఉమాదేవిని తమ అభ్యర్థులుగా జనసేన ప్రకటించింది.  హైదరాబాదులో ప్రధాన మంత్రి పాల్గొన్న భారీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డయాస్‌ను పంచుకుని ప్రసంగించిన.. కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =