విజయవంతంగా ‘కంటి వెలుగు’: ఇప్పటికి 33,60,301 మందికి పరీక్షలు, 6,76,732 మందికి రీడింగ్ గ్లాసెస్

Kanti Velugu 3360301 People Screened and Reading Glasses Handed over to 676732 People till February 10th,Kanti Velugu Medical Camp,Kanti Velugu Medical Camp For Secretariat Employees,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Latest News And Updates,Kanti Velugu News And Live Updates,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister Ktr

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు వైద్య శిబిరాలలో ఇప్పటివరకు (ఫిబ్రవరి 10, శుక్రవారం) 33 లక్షల 60 వేల 301 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమంలో ఫిబ్రవరి 10 నాటికీ 6 లక్షల 76 వేల 732 మందికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.

కంటి వెలుగు (2023, ఫిబ్రవరి 10న)

  • కంటి ప‌రీక్ష‌లు: 2,01,435 మంది
  • రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 30,777
  • ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 20,339
  • కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 1,50,310 మంది

కంటివెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు (2023, ఫిబ్రవరి 10) మొత్తం వివరాలు:

  • మొత్తం కంటిప‌రీక్ష‌లు: 33,60,301 మంది
  • మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 6,76,732
  • మొత్తం ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 4,60,775
  • కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 22,22,669 మంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fourteen =