ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రారంభం, ట్యాంక్‌బండ్‌ వద్ద కోలాహలం

Ganesh, Ganesh Immersion, Ganesh Nimarjanam, Ganesh Nimarjanam 2020, Ganesh Nimarjanam News, Khairatabad Ganapati Immersion, Khairatabad Ganesh 2020, khairatabad ganesh nimajjanam, khairatabad ganesh nimajjanam 2020, Khairatabad Maha Ganapati Immersion, Khairatabad Maha Ganapati Immersion Started, Telangana Ganesh Idol Immersion

హైదరాబాద్‌ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. కరోనా నేపథ్యంలో గతంలో లాగా కాకుండా తక్కువ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసి, అందంగా ముస్తాబు చేసి ప్రజలు పూజలు నిర్వహించారు. మరోవైపు నిమజ్జనాల్లో పాల్గొనే ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ గణేశ్‌ నిమజ్జనాలు జరుపుకోవాలని హైదరాబాద్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ‌ఈ కార్యక్రమం బందోబస్తు కోసం 15వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొనగా, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో 50వేల సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.

మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిమజ్జనం పూర్తి కానుంది. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా ఈ సంవత్సరం గణేశుడు పూజలు అందుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌ మీదకు చేరుకొని క్రేన్‌ నెం.4 దగ్గర నిమజ్జనం కార్యక్రమం జరగనుంది. కరోనా పరిస్థితుల వలన ముందుగా ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించినప్పటికీ, భక్తుల విజ్ఞప్తి మేరకు ఎప్పటిలాగానే‌ శోభయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు కమిటీ సభ్యలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =