పార్టీ నాయకులతో సీఎం కెసిఆర్ భేటీ

CM KCR Conducts TRS Executive Meeting in Telangana Bhavan, CM KCR Meeting With Party Leaders In Telangana Bhavan, CM KCR to Hold Meeting With Party Leaders, Latest Political News, Mango News, Telangana CM KCR, Telangana Political News, TRS Executive Meeting Begins in Telangana Bhavan, TS CM KCR To Visit Telangana Bhavan for Meeting

తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులు,కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు, ఈ సమావేశంలో ముఖ్యంగా సభ్యత్వ నమోదు, అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణం, రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలు, ఇతర ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు లో లక్ష్యాన్ని చేరుకునేందుకు నాయకులు అనుసరించాల్సిన విధానాలను కెసిఆర్ తెలియజేయనున్నారు.

కొత్తగా రూపొందించిన మునిసిపల్ బిల్లు ఆమోదించడానికి 18, 19 వ తేదీల్లో తెలంగాణ శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. బిల్లు ఆమోదించిన తరువాతనే, మునిసిపల్ ఎన్నికలు వెళ్లాలని ఇటీవలే ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు, ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై పార్టీ నాయకులకు కెసిఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో కొన్ని స్థానాల్లో బిజెపి పుంజుకోవడం వలన, ఆ స్థానాల్లో తెరాస నాయకుల పనితీరు ని కూడ సమీక్ష చేయనున్నారు. మునిసిపల్ ఎన్నికలలో అన్ని స్థానాల్లో తెరాస జెండా ఎగరవెయ్యాలని, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి నేతలకు ముఖ్యమంత్రి వివరించనున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=hl1QGixQbaE]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =