సెప్టెంబర్ 23 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

Bathukamma Sarees 2019, Bathukamma Sarees Will be Distribute From 23rd September, KTR Says Bathukamma Sarees Will be Distribute, KTR Says Bathukamma Sarees Will be Distribute From 23rd September, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడ తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభమవుతుందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళకు ఈ నెల 23వ తేదీ నుంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

1.02 కోట్ల మంది అర్హులైన మహిళలకు ఈ చీరలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ప్రతిసారి నాణ్యతతో బతుకమ్మ చీరలు తయారుచేస్తున్నామని, ఈ ఏడాది ప్రభుత్వం రూ.300 కోట్లకు పైగా ఇందుకు వెచ్చించినట్టు తెలిపారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యార్‌, తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + sixteen =