వాహనదారులకు బంపర్ ఆఫర్

A Bumper Offer For Motorists, Offer For Motorists, Motorists A Bumper Offer, Telangana Police, Traffic Challan, E Challan, Traffic Police, Mango News, Mango News Telugu, TS Governament Traffic Challan, Traffic Challan Offer, Latest Offer For Motorists, Good News For Motorists, Telangana, Latest Telangana News
Telangana police, Traffic challan, E challan, Traffic police

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చాలు చలానాలు వడ్డిస్తుంటారు పోలీసులు. హెల్మెట్ లేకపోయినా.. రాంగ్ రూట్‌లో వెళ్లినా.. ఓవర్ స్పీడ్‌గా వెళ్లినా.. చివరికి వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోయినా ఫొటో తీసి చలాన్లు పంపిస్తుంటారు. ఒకప్పుడు  పట్టణాల్లో మాత్రమే చలాన్లు విధించే వారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా చలాన్లు వడ్డిస్తున్నారు. అయితే ట్రాఫిక్ రూల్స్ ఎంతకఠినతరం చేసినప్పటికీ కొందరు వాహనదారులు మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ తమకు ఇష్టం వచ్చినట్లుగానే వెళ్తున్నారు. వేల రూపాయల చలాన్ విధించినప్పటికీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటే.. గుట్టుల్లా పేరుకుపోతున్నాయే తప్ప చలాన్లు మాత్రం క్లియర్ కావడం లేదు. కొందరు వాహనదారులు మొండికేసి చలాన్లను చెల్లించడం లేదు. అయితే గతంలో గుట్టల్లా పేరుకుపోయిన చలాన్లను వసూల్ చేసేందుకు బీఆర్ఎస్ సర్కార్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది. భారీ స్థాయిలో డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో దెబ్బకు పేరుకుపోయిన చలాన్లన్నీ క్లియర్ అయిపోయాయి. అప్పటి వరకు చలాన్లు కట్టేందుకు మొండికేసిన వాళ్లు కూడా.. ముందుకొచ్చి చల్లించారు. 45 రోజుల్లోనే దాదాపు రూ. 300 కోట్ల మేర చలాన్లు వసూల్ అయ్యాయి.

అప్పుడు దాదాపు 65 శాతం వరకు చలాన్లు క్లియర్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ చలాన్లు కుప్పలా పేరుకుపోయాయి. దాదాపు రూ. 2 కోట్ల వరకు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు కూడా పెండింగ్ చలాన్లను క్లియర్ చేయకుండా.. మరోసారి ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వకపోదా.. అప్పుడు క్లియర్ చేద్దాంలే.. అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు.

దీంతో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ చలాన్లను క్లియర్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి డిస్కౌంట్ ప్రకటించింది. టూవీలర్స్‌పై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం, భారీ వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు అధికారులు అవకాశం కల్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + six =