మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ

Minister KTR Chairs Cabinet Sub Committee Meeting on House Sites at BRKR Bhavan,Minister KTR Chairs Cabinet,KTR Chairs Cabinet Sub Committee,Cabinet Sub Committee Meeting,House Sites at BRKR Bhavan,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు, జీఓ 58, 59, సాదాబైనామా, నోటరీ పత్రాలు, ఎండోమెంట్/వక్ఫ్ భూములు తదితరాల అమలుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి సి.హెచ్ మల్లారెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మరియు ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశం ప్రారంభంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2014 సంవత్సరంలో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. జిఓ 58 క్రింద 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటి స్థలాల పట్టాల జారీని వేగవంతం చేయాలని సబ్‌ కమిటీ అధికారులను ఆదేశించింది.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నోటరీ చేయబడిన పత్రాల గురించి ప్రస్తావిస్తూ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కేసుల ప్రక్రియను, సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. “పేదలకు అనుకూలమైన” విధానాన్ని తీసుకోవాలని మరియు అర్హత ఉన్న అన్ని కేసులను త్వరగా పూర్తి చేయాలని సబ్ కమిటీ అధికారులకు సూచించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =