బ‌తుక‌మ్మ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించాలి, బ‌తుక‌మ్మ చీరలు మ‌హిళ‌లంద‌రికీ అందేలా చూడాలి: మంత్రి ఎర్ర‌బెల్లి

Minister Errabelli Dayakar Rao Held Teleconference with Public Representatives Officials on Bathukamma Festival, Minister Errabelli Dayakar Rao ,Bathukamma Festival Should Be Solemnized, Bathukamma Sarees , Telangana Govt Readies More than 1 Cr Bathukamma Sarees, Bathukamma Sarees Distribution, Bathukamma Sarees, Mango News, Mango News Telugu, Telangana Govt Bathukamma Sarees, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Celebration, Telangana Bathukamma Celebration, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Latest News And Updates, Telangana Govt News And Live Updates

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌తి ఏటా ఘనంగా నిర్వ‌హిస్తున్న బ‌తుక‌మ్మ వేడుకలను ఈ ఏడాది కూడా క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, దేవ‌రుప్పులు, కొడ‌కండ్ల‌, పెద్ద వంగ‌ర‌, తొర్రూరు, రాయ‌ప‌ర్తి మండ‌లాల‌ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, పోలీసుల‌తో మంత్రి శ‌నివారం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు, బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర పండుగా ప్ర‌క‌టించి, క‌న్నుల పండుగ‌గా ప్ర‌భుత్వం త‌ర‌పున‌నే నిర్వ‌హిస్తున్నార‌న్నారు. అంతేగాక దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తి ఏటా కోటి మందికి పైగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అందిస్తున్నార‌ని తెలిపారు. 339 కోట్లు ఖ‌ర్చు చేసి, ఈ పండుగను అద్భుతంగా నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ఈ ద‌శ‌లో ఈ ఏడాది పండుగ‌ను గ‌తంలో కంటే మ‌రింత వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని మంత్రి ఆదేశించారు. చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌న‌ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ దీపాలు, అలంక‌ర‌ణ‌తో ఆక‌ర్ష‌ణీంగా నిమ‌జ్జ‌న స్థ‌లాలు ఉండాలని సూచించారు.

“మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త ఏర్పాట్లు జ‌ర‌గాలి. ఎక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నిమ‌జ్జ‌నం వ‌ద్ద మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండండి. అంద‌రినీ లోతైన ప్ర‌దేశాల‌కు నిమ‌జ్జ‌నానికి ఎవ‌రినీ అనుమ‌తించ‌వ‌ద్దు. ప్ర‌జాప్ర‌తినిధులు అధికారులు, పోలీసుల‌తో స‌మ‌న్వ‌యంతో మెల‌గాలి. బ‌తుక‌మ్మ చీరలు మ‌హిళ‌లంద‌రికీ అందేలా చూడాలి. బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అవ‌మానించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. అలాంటి వాళ్ళ‌ని ఉపేక్షించ వద్దు. బ‌తుక‌మ్మ‌ల పోటీ పెట్టి బ‌హుమ‌తులు అంద‌చేయండి. డ‌ప్పు చ‌ప్పుళ్ళ‌తో సంప్ర‌దాయ బ‌ద్దంగా ఊరంతా వేడుక‌లా బ‌తుక‌మ్మ పండు జ‌ర‌గాలి” అని చెప్పారు. అలాగే ద‌స‌రా పండుగ వేడుక‌ల‌కు కూడా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twenty =