‘దళిత బంధు పథకం’ దేశానికే ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి

Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme Implementation, Dalit Bandhu Scheme In Telangana, Dalit Bandhu Scheme is A Model For The Nation, Dalit Bandhu Scheme is A Model For The Nation Says Minister Errabelli Dayakar Rao, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Pilot Project, Dalit Bandhu Scheme Updates, Errabelli Dayakar Rao, Guidelines for Telangana Dalit Bandhu Scheme, Mango News, Minister Errabelli Dayakar Rao, Telangana Dalit Bandhu scheme

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ‘దళిత బంధు పథకం’ దేశానికే ఆదర్శమని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న పథకం ఇది అని చెప్పారు ఎర్రబెల్లి. అందుకే, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వినియోగించుకొని సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. శుక్రవారం పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని తీగారం, బంజారా గ్రామాలలోని దళిత వాడలలో ‘దళిత బంధు’ కార్యక్రమం అమలుపై నిర్వహించిన గ్రామ సభలలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.

దళిత బంధు కార్యక్రమంలో భాగంగా తీగారం గ్రామంలో 20 మంది, బంజారా గ్రామంలో 15 మంది షెడ్యూల్డ్ కులాల కుటుంబాల లబ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్చి 7వ తేదీ వరకూ గ్రౌండింగ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత వారికి శిక్షణ, పెట్టబోయే పథకంపై వారికి సరైన అవగాహన కల్పించే విధంగా అధికారులు శ్రద్ధ వహించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా మొదటి దశలో.. ఈనెల 5వ తేదీకి ప్రతి నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు మంత్రి. అందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో 6 గ్రామాల నుండి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. దళిత బంధు పథకం క్రింద రాష్ట్రంలోని 17 లక్షల మంది దళితులకు వచ్చే మూడు నాలుగు ఏళ్ళలో ఆర్థిక సహాయాన్ని అందించినున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దీనికోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + five =