1024 కోట్ల ఉపాధి హామీ పెండింగ్ నిధులు వెంట‌నే విడుద‌ల చేయాలి: మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Writes a Letter to Union Minister Tomar on Pending MGNREGS Funds of Rs 1024 Cr,Telangana Urges Union Govt To Release Funds Worth Rs 1024 Cr Pending Under MGNREGS,Telangana Urges Union Govt To Release Funds Worth Rs 1,024 Cr,Telangana Govt Urges Centre To Release Rs 1024 Crore Under MGNREGS,Mango News,Mango News Telugu,Telangana Panchayat Raj Minister Errabelli Dayakar Rao, Minister Errabelli Asks Centre To Release MGNREGS Funds,Minister Errabelli,Telangana Panchayat Raj Minister,Union Minister Tomar,MGNREGS Funds,MGNREGS Funds 1024 Cr,Minister Errabelli on Pending MGNREGS Funds of Rs 1024 Cr,Minister Errabelli Writes a Letter to Union Minister Tomar

ఉపాధి క‌ల్ప‌న‌లో దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డుల‌తోపాటు, రావాల్సిన పెండింగ్ నిధుల‌ను కూడా వెంట‌నే విడుద‌ల చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర మంత్రి, కేంద్ర‌ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది‌ శాఖల‌ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూపొందించిన అనేక ప‌థ‌కాల‌తోపాటు 32 జిల్లాల్లో 540 మండ‌లాల్లోని 12,770 గ్రామాల్లో మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థకాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి కేంద్ర మంత్రికి రాసిన లేఖ‌లో తెలిపారు. ఈ ఏడాది ఉపాధి ప‌ని దినాల ల‌క్ష్యం 13.75 కోట్లు కాగా, 13.37 కోట్ల ప‌నిదినాల‌ను నిర్ణీత స‌మ‌యానికి చాలా ముందే సాధించామ‌న్నారు. అంటే 97.37శాతం ల‌క్ష్య సాధ‌న‌తో దేశంలోనే రాష్ట్రం మొద‌టి స్థానంలో నిలిచింద‌న్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కేంద్ర మంత్రికి రాసిన లేఖ‌లో తెలిపారు.

1024.59 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాలి:

క‌రోనా స‌మ‌యంలోనూ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి గ్రామాల‌కు తిరిగి వెళ్ళిన ల‌క్ష‌లాది మంది వ్య‌వ‌సాయ కూలీల‌కు కూడా ఉపాధి క‌ల్పించిన‌ట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రావాల్సిన వాటా 1719.25 కోట్ల‌కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 694.66 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశారని తెలిపారు. ఇంకా రావాల్సిన 1024.59 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్ప‌టికే ప‌నులు పూర్తిచేసి బిల్లులు రాక కూలీలు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. చేసిన ప‌నులతో ఉపాధి హామీ ప‌థ‌కం ఆశ‌యాన్ని నెర‌వేరుస్తూ ల‌క్ష్యాల‌ను సాధిస్తూ, దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తూ, అవార్డులు పొందుతూ, ఉపాధి హామీలో అగ్ర‌గామిగా ఉన్న తెలంగాణకి ఉపాధి హామీ పెండింగ్ నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కేంద్ర మంత్రికి రాసిన లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =