తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల నియామ‌కానికి “కామన్ బోర్డు” ఏర్పాటు

Telangana Govt Constitutes Common Board For Recruitment of Teaching Non Teaching Posts in Universities, Govt Constitutes Common Board For Recruitment of Teaching Non Teaching Posts in Universities, Telangana Govt Constitutes Common Board For Recruitment of Non Teaching Posts in Universities, Telangana Govt Constitutes Common Board For Recruitment of Teaching Posts in Universities, Common Board For Recruitment of Teaching Non Teaching Posts in Universities, Recruitment of Teaching Non Teaching Posts in Universities, Recruitment of Non Teaching Posts in Universities, Recruitment of Teaching Posts in Universities, Teaching And Non Teaching Posts in Universities, Non Teaching Posts, Teaching Posts, Universities, Telangana Govt Constitutes Common Board, Recruitment of Teaching And Non Teaching Posts News, Recruitment of Teaching And Non Teaching Posts Latest News, Recruitment of Teaching And Non Teaching Posts Latest Updates, Recruitment of Teaching And Non Teaching Posts Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మెడిక‌ల్ యూనివ‌ర్సిటీల మినహా ఇతర అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల నియామ‌కానికి “కామన్ బోర్డు”ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన అన్ని ఇతర విధులను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఈ కామ‌న్ బోర్డుకు చైర్మ‌న్‌ గా ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సభ్యులుగా ఉన్నత విద్యాశాఖ‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ మరియు ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ ఉండనున్నారు. అలాగే బోర్డు సభ్యుడు, క‌న్వీన‌ర్‌గా క‌ళాశాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్ ఉండనున్నారు. కామన్ బోర్డు పనితీరు, ఇతర గైడ్ లైన్స్ ప్రత్యేకంగా జారీ చేయబడతాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెడిక‌ల్ యూనివ‌ర్సిటీల మిన‌హా మిగ‌తా 15 యూనివ‌ర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకాలను యూనివ‌ర్సిటీలే చేపడుతున్నాయి. నియామకాల విషయంలో ఏకరూపత మరియు వేగవంతమైన నియామకాలను తీసుకురావడానికి మరియు అనేక సమస్యలను పరిశీలించడానికి ప్రభుత్వం తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి నేతృత్వంలో స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామ‌కాల ప్రక్రియను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కు అప్పగించడం లేదా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనీ సూచించింది. ఈ నేపథ్యంలోనే నియామ‌కాల‌ కోసం కామ‌న్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కామన్ బోర్డు ఏర్పాటుపై విద్యాశాఖ సెక్రటరీ వాకాటి అరుణ గురువారం జీవో 16 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + four =