తెలంగాణలో ఇకపై ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం – మంత్రి హ‌రీష్ ‌రావు కీలక ప్రకటన

Minister Harish Rao Announces Govt will Release Job Calendar Every Year in Telangana, Job Calendar Every Year in Telangana, Harish Rao Announces Govt will Release Job Calendar Every Year in Telangana, Minister Harish Rao Announces Govt will Release Job Calendar Every Year, TRS government has decided to issue a recruitment calendar every year so that vacancies are filled in government departments from time to time, Telangana government has decided to issue a recruitment calendar every year, Job recruitment Calendar Every Year, Minister Harish Rao, Telangana Minister Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Telangana Job Calendar, Telangana Job Calendar News, Telangana Job Calendar Latest News, Telangana Job Calendar Latest Updates, Telangana Job Calendar Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ఇకపై ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ ‌రావు కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అలాగే మినీ వ్యవసాయ మార్కెట్ సముదాయాన్ని ఓపెన్ చేశారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ఉచిత భోజన కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పరీక్షలు రాయనున్న అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంద‌ని, దీని ద్వారా 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. అయితే గ్రూప్-1 మరియు గ్రూప్-2 పోస్టుల‌కు ఇంటర్వ్యూలతో పనిలేకుండా కేవలం రాత పరీక్ష ద్వారానే నియామకాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 317తో అన్ని జిల్లాల ఉద్యోగులకు సమన్యాయం చేస్తోందని స్పష్టం చేశారు. కానీ, 15 లక్షలకు పైగా ఖాళీలను భ‌ర్తీ చేయకుండా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి హ‌రీష్ ‌రావుతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్‌ రోజా శర్మ, రాష్ట్ర గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ శ్రీధ‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + four =