30 ఏళ్లకే బీపీ బారిన పడుతున్నారు, యువత జాగ్రత్తగా ఉండాలి – వరల్డ్ హైపర్ టెన్షన్ డే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Attends A Survey Program of World Hypertension Day 2022 at Hyderabad Taj Deccan, Harish Rao Attends A Survey Program of World Hypertension Day 2022 at Hyderabad Taj Deccan, Survey Program of World Hypertension Day 2022 at Hyderabad Taj Deccan, World Hypertension Day 2022, 2022 World Hypertension Day, World Hypertension Day, Hyderabad Taj Deccan, Finance Minister Harish Rao, Minister Harish Rao, Finance Minister, Harish Rao, 2022 World Hypertension Day News, 2022 World Hypertension Day Latest News, 2022 World Hypertension Day Latest Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే 2022 సందర్భంగా.. గ్లోబల్ హాస్పిటల్స్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెలుగు చూసిన విషయాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ ​రావు. కోవిడ్ తర్వాత రక్తపోటుపైన నిర్వహించిన సర్వే రిపోర్టును మంత్రి విడుదల చేశారు. కోవిడ్ అనంతర లక్షణాలతో బాధపడుతున్నవారిలో బీపీ బాధితులే ఎక్కువగా ఉన్నారని ఈ సర్వేలో తేలిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తాజ్​డెక్కన్​లో జరిగిన ఈ కార్యకమానికి హరీష్ ​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీపీ పై అవగాహన కల్పించడానికే ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ టెన్షన్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే ప్రకారం.. కిడ్నీ సమస్యలున్న వారిలో 60శాతం మందికి హైపర్‌ టెన్షన్‌ ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. 90లక్షల మందికి స్క్రీనింగ్‌ చేస్తే.. తమ స్క్రీనింగ్‌లో 13లక్షల మందికి హైపర్‌ టెన్షన్‌ ఉందని తేలిందన్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. ఆయుష్‌ ద్వారా 450 వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ద్వారా యోగా, ఫిట్​నెస్ కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నామని, 45 సంవత్సరాలు దాటిన వారు తరచుగా బీపీ, షుగర్‌ టెస్టులను చేయించుకోవాలని మంత్రి హరీష్ ​రావు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =