తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామ‌క ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాలి – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Held Review Meet on The Govt Jobs Regarding Notifications in Telangana, Minister T Harish Rao Review Meeting on Govt Job Notifications, Telangana Government Job Notifications, Mango News, Mango News Telugu, Telangana Finance Minister T Harish Rao, Government Job Notifications Latest News And Updates, Telangana Issues Notifications For Govt Jobs, Telangana News, T Harish Rao News And Live Updates, Medical And Health Dept Govt Job Notifications, Medical And Health Department Job Recruitment News, Telangana Government Jobs Recruitment,

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామ‌క ప్రక్రియ‌ను మరింత వేగ‌వంతం చేయాలని సూచించారు రాష్ట్ర వైద్యారోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మేరకు ఆయన ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్​లో నిర్వహించిన ఈ సమావేశానికి సీఎస్​ సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో పాటు పోలీసు రిక్రూట్​ మెంట్​ బోర్డు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలోని ఖాళీలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖాళీ పోస్టులపై పూర్తి వివరాలు ఇవ్వాలని, అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన నియామ‌కాల గురించి సమాచారం అందించాలని కోరారు.

ఈ క్రమంలో.. ఆర్థికశాఖ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 50 వేల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి హరీష్ రావుకి వివరించారు. అయితే వాటిలో చాలావరకు ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో జారీ కాకపోవడం మంత్రి గుర్తించారు. అలాగే పోలీస్, గ్రూప్ 1 పోస్టులు మినహా మిగిలిన శాఖలలోని ఖాళీలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. ఇక ఇటీవలే మోటార్ ఇన్ స్పెక్టర్, ఫుడ్ ఇన్ స్పెక్టర్, డివిజన్ అకౌంట్ ఆఫీర్ తదితర పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇవన్నీ పరిశీలించిన మీదట మంత్రి అనుకున్న స్థాయిలో నోటిఫికేషన్స్ జారీ చేయక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, ముఖ్యంగా గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంజనీర్ల నియామక నోటిఫికేషన్ల విషయంలో జాప్యం చేయరాదని అధికారులకి సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here