హైదరాబాద్‌: చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ

Telangana Home Minister Mahmood Ali Inaugurates Chandrayangutta FlyOver in Hyderabad Today, Chandrayangutta Extension Flyover Inaugurated, Chandrayangutta Flyover Inaugurated By Minister Mahmood Ali, Mango News, Mango News Telugu, Chandrayangutta Flyover Now Open To Public, Home Minister Mahmood Ali Latest News And Updates, Chandrayangutta Flyover News And Live Updates, Telangana News, Chandrayangutta Flyover, Telangana Home Minister Mahmood Ali, Chandrayangutta Flyover Opened, TRS Party, Chandrayangutta Flyover News,Telangana Flyover,

హైదరాబాద్‌ నగరంలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్‌ను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి ప్రభుత్వం రూ. 45 కోట్లకు పైగా వ్యయంతో 674 మీటర్ల పొడవుతో ఇరువైపులా నాలుగు లేన్లతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించడం విశేషం. ఇక ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం‎తో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ప్రయాణం సులభతరం కానుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‎ను మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వలన హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కాగా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fourteen =