టీ-కాంగ్రెస్‌లో గొడవలన్నీ సమసిపోయాయి, అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కుర్చోపెడతాం – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Fires on BRS Govt and CM KCR in Dalit Girijana Atma Gourava Sabha at Nagarkurnool,TPCC Chief Revanth Reddy, Fires on BRS Govt,CM KCR in Dalit Girijana Atma Gourava Sabha,Dalit Girijana Atma Gourava Sabha at Nagarkurnool,Dalit Girijana Atma Gourava Sabha,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

టీ-కాంగ్రెస్‌లో గొడవలన్నీ సమసిపోయాయని, ఇప్పుడు పార్టీలో నేతలమంతా కలిసిపోయామని పేర్కొన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొన్న క్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరియు సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కూర్చోబెట్టే వరకూ విశ్రమించనని స్పష్టం చేశారు. టీపీసీసీ ఇంఛార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే వచ్చాక పార్టీలో గొడవలన్నీ సమసిపోయాయని, ఇప్పుడు పార్టీలో నేతలమంతా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని, అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై ప్రశ్నించిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన దళిత, గిరిజనుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని అన్నారు. తెలంగాణలో దళితులను, గిరిజనులను బీఆర్‌ఎస్ నేతలు అవమానిస్తున్నారని, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలోని దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని, దళితులపై చేస్తున్న దాడులను అడ్డుకుని వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పెత్తందార్లకు అండగా బీఆర్‌ఎస్, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ బీజేపీ ఉంటే.. దళిత, గిరిజనుల వెనుక కాంగ్రెస్ ఉందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =