సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

Minister Jagadish Reddy Released Water to Nagarjuna Sagar Left Bank Canal, Telangana Minister Jagadish Reddy Released Water to Nagarjuna Sagar Left Bank Canal, Jagadish Reddy Released Water to Nagarjuna Sagar Left Bank Canal, Water to Nagarjuna Sagar Left Bank Canal, Nagarjuna Sagar Left Bank Canal, Minister Jagdish Reddy releases irrigation water to Nagarjuna Sagar Left Bank Canal, Jagdish Reddy releases irrigation water to Nagarjuna Sagar Left Bank Canal, irrigation water to Nagarjuna Sagar Left Bank Canal, irrigation water, Telangana Minister Jagadish Reddy, Minister Jagadish Reddy, Telangana Minister, Jagadish Reddy, Nagarjuna Sagar Left Bank Canal News, Nagarjuna Sagar Left Bank Canal Latest News, Nagarjuna Sagar Left Bank Canal Latest Updates, Nagarjuna Sagar Left Bank Canal Live Updates, Mango News, Mango News Telugu,

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, దశాబ్దకాలం తరువాత జూలై నెలలోనే నీటి విడుదల చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత జూలై నెలలో నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఎకరాలలో పంట సాగు జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో 1.45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,41,000 ఎకరాలు (ఎత్తిపోతలతో కలుపుకుని) సాగులో ఉన్నాయన్నారు. టీఎంసీల వారీగా నల్లగొండ జిల్లాకు 18, సూర్యాపేట జిల్లాకు 18, ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు అందుతున్నాయని చెప్పారు. ఇక కృష్ణా జలాల వాటాలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని, తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందుతుందన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే అదనంగా నీరు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =