ఏపీలో విద్యాపరంగా వెనుకబడిన 7 జిల్లాలకు, రూ.317 కోట్లు గ్రాంట్‌ విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

AP Central Govt Approves For The Release of Rs 317 Cr Grants To 7 Educationally Backward Districts, Central Govt Approves For The Release of Rs 317 Cr Grants To 7 Educationally Backward Districts, Project Approval Board, Rashtriya Uchchatar Shiksha Abhiyan, 7 Educationally Backward Districts In AP, AP Educationally Backward Districts, Educationally Backward Districts, University Grants Commission, educationally backward districts, UGC identified 374 EBDs In India, AP Educationally Backward Districts News, AP Educationally Backward Districts Latest News, AP Educationally Backward Districts Latest Updates, AP Educationally Backward Districts Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాపరంగా వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.317 కోట్ల గ్రాంట్‌ విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. ఈ నిధులతో ఆయా జిల్లాలలో మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో పాటు కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచనున్నారు. కాగా బుధవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి సుభాష్‌ సర్కార్‌ ఈ విధంగా బదులిచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 374 జిల్లాలు విద్యాపరంగా వెనకబడినట్లు యూజీసీ నిపుణుల సంఘం గుర్తించిందని తెలిపిన ఆయన ఏపీలో ఏపీలోని అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విద్యలో వెనకబడిన జిల్లాలుగా గుర్తించినట్లు చెప్పారు.

ఈ జిల్లాల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి, జాతీయ సగటు 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు యూజీసీ నిపుణుల సంఘం దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని, దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా)ను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ ‘రూసా’ పథకం కింద విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుతో పాటు కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులను గ్రాంట్‌గా మంజూరు చేస్తుందని, ఈ క్రమంలోనే ఏపీలోని వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.317 కోట్లు విడుదల చేయాలని ‘రూసా’ బోర్డు నిర్ణయించిందని మంత్రి సుభాష్‌ సర్కార్‌ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + sixteen =