హైదరాబాద్‌ లో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన, ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

Telangana CS Somesh Kumar Reviewed on Arrangements for PM Modi’s 3 Days Visit to Hyderabad, CS Somesh Kumar Reviewed on Arrangements for PM Modi’s 3 Days Visit to Hyderabad, Somesh Kumar Reviewed on Arrangements for PM Modi’s 3 Days Visit to Hyderabad, Reviewed on Arrangements for PM Modi’s 3 Days Visit to Hyderabad, Arrangements for PM Modi’s 3 Days Visit to Hyderabad, PM Modi’s 3 Days Visit to Hyderabad, Telangana Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, CS Somesh Kumar, Somesh Kumar, Telangana CS, PM Modi’s Hyderabad Visit, PM Modi Hyderabad Tour News, PM Modi Hyderabad Tour Latest News, PM Modi Hyderabad Tour Latest Updates, PM Modi Hyderabad Tour Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ గురువారం సమీక్షించారు. పోలీసులు, ఇతర ఉన్నతాధికారులతో బీ.ఆర్‌.కే.ఆర్ భవన్‌లో సీఎస్ సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న ప్రధాని మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ జూలై 2వ తేదీన హైదరాబాద్ చేరుకుని, 4వ తేదీ ఉదయం బయలుదేరి వెళ్తారని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అందరూ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్ నగరానికి రానున్నారని సీఎస్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రధాని పర్యటన సందర్భంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ట్రాఫిక్‌ ను సజావుగా సాగేలా చూడాలని, అధికారులందరూ సమన్వయంతో, అత్యంత జాగరూకతతో పని చేయాలని సూచించారు. బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్‌లో బారికేడింగ్, లైటింగ్ మరియు ఇతర అన్ని ఏర్పాట్లను రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా పాటించాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, టీఆర్ అండ్ బీ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌, రాజ్‌భవన్‌ గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here