రేపే వైఎస్ఆర్ కాపు నేస్తం మూడో విడత, వారి ఖాతాల్లోకి 15 వేలు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్

CM YS Jagan to Release YSR Kapu Nestham 3rd Phase Funds on July 29 at Kakinada, AP CM YS Jagan to Release YSR Kapu Nestham 3rd Phase Funds on July 29 at Kakinada, AP CM YS Jagan Mohan Reddy to Release YSR Kapu Nestham 3rd Phase Funds on July 29 at Kakinada, AP CM to Release YSR Kapu Nestham 3rd Phase Funds on July 29 at Kakinada, YSR Kapu Nestham 3rd Phase Funds, 3rd Phase Funds Of YSR Kapu Nestham, YSR Kapu Nestham, Kakinada, YSR Kapu Nestham Scheme 2022, 2022 YSR Kapu Nestham Scheme, YSR Kapu Nestham Scheme, YSR Kapu Nestham Scheme 3rd Phase Funds News, YSR Kapu Nestham Scheme 3rd Phase Funds Latest News, YSR Kapu Nestham Scheme 3rd Phase Funds Latest Updates, YSR Kapu Nestham Scheme 3rd Phase Funds Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు (జూలై 29, శుక్రవారం) కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా “వైఎస్ఆర్ కాపు నేస్తం” మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ముందుగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల జీవనోపాధిని మెరుగుపర్చేలా ఏడాదికి రూ.15 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.75 వేల ఆర్ధిక సాయాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను మహిళల ఖాతాల్లో జమ చేయగా, ఇక మూడో విడత సాయాన్ని జూన్ 29న కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో జరిగే బహిరంగ సభ నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నాడు సీఎం కార్యక్రమాల కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే పెండెం దొరబాబు, తదితరులు గొల్లప్రోలులోని ఓ ప్రైవేట్ లేఔట్ లో సభా వేదిక, హెలిప్యాడ్ సహా ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు. మరోవైపు సీఎం పర్యటనపై రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా కూడా కాకినాడ కలెక్టరేట్ లో వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =