క్రిస్టియన్ భవన నిర్మాణానికి 2 ఎకరాల భూమి సిద్ధం, క్రిస్మస్ ముందే శంకుస్థాపన : మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar Says Foundation Will Lay For Construction Of Christian Bhavan Before Christmas, Foundation Will Lay For Construction Of Christian Bhavan Before Christmas, Construction Of Christian Bhavan Before Christmas, Christian Bhavan, Telangana Christian Bhavan, Minister Koppula Eshwar, Telangana Minister Koppula Eshwar, Christian Bhavan at Uppal Bhagayath, Welfare Minister Koppula Eshwar, Christian Bhavan News, Christian Bhavan Latest News, Christian Bhavan Live Updates, Mango News, Mango News Telugu

క్రైస్తవ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో శనివారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈనెల 21 లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క్రిస్మస్ కి ముందే ఉప్పల్ బాగయత్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకును మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనార్టీస్ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, క్రిస్టియన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఏకే ఖాన్, మైనారిటీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ లుక్, క్రిస్టియన్ కమ్యూనిటీ నేతలు రాయడన్ రోస్, మోహన్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 15 =