తెలంగాణలో 2023 లో సాధారణ, ఐచ్ఛిక సెలవులపై ప్రకటన, పూర్తి జాబితా ఇదే…

Telangana Govt Notifies General Holidays and Optional Holidays for the Year 2023,Telangana Govt General Holidays,Telangana Govt Optional Holidays,Telangana Holidays Year 2023,Mango News,Mango News Telugu,Telangana Govt Latest News And Updates,Telangana Govt,Telangana Holidays,Optional Holidays Telangana,General Holidays Telangana,Telangana News And Live updates,Telangana Govt Holidays

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవులపై నేడు (నవంబర్ 16, బుధవారం) నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్), వేతనంతో కూడిన సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 లో మొత్తం 28 రోజుల సాధారణ సెలవులు, మరో 24 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించారు. మరోవైపు రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, మిలాద్‌ ఉన్‌ నబి వంటి పండుగల సెలవులపై మార్పులేమైనా ఉంటే అప్పుడు ప్రత్యేకంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

సాధారణ సెలవులు:

  1. కొత్త సంవత్సరం – జనవరి 1 – ఆదివారం
  2. భోగి – జనవరి 14 – రెండో శనివారం
  3. సంక్రాంతి – జనవరి 15 – ఆదివారం
  4. రిపబ్లిక్ డే – జనవరి 26 – గురువారం
  5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 18 – శనివారం
  6. హోలీ – మార్చి 7 – మంగళవారం
  7. ఉగాది – మార్చి 22 – బుధవారం
  8. శ్రీరామ నవమి – మార్చి 30 – గురువారం
  9. బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5 –బుధవారం
  10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్‌ 7 – శుక్రవారం
  11. అంబేడ్కర్‌ జయంతి – ఏప్రిల్‌ 14 – శుక్రవారం
  12. రంజాన్‌ – ఏప్రిల్ 22 – శనివారం
  13. రంజాన్‌ మరుసటి రోజు – ఏప్రిల్ 23 – ఆదివారం
  14. బక్రీద్‌ – జూన్ 29 – గురువారం
  15. బోనాలు – జూలై 17 – సోమవారం
  16. మొహర్రం – జూలై 29 – శనివారం
  17. స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15 – మంగళవారం
  18. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 7 – గురువారం
  19. వినాయక చవితి – సెప్టెంబర్ 18 – సోమవారం
  20. మిలాద్‌-ఉన్‌-నబి – సెప్టెంబర్ 28 – గురువారం
  21. గాంధీ జయంతి – అక్టోబరు 2 – సోమవారం
  22. బతుకమ్మ ప్రారంభం – అక్టోబరు 14 – రెండో శనివారం
  23. దసరా – అక్టోబరు 24 – మంగళవారం
  24. దసరా మరుసటి రోజు – అక్టోబర్ 25 – బుధవారం
  25. దీపావళి – నవంబరు 12 – ఆదివారం
  26. కార్తిక పౌర్ణమి/ గురునానక్‌ జయంతి – నవంబరు 27 – సోమవారం
  27. క్రిస్టమస్ -‌ డిసెంబరు 25 – సోమవారం
  28. బాక్సింగ్‌ డే – డిసెంబరు 26 – మంగళవారం

ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవులు:

  1. కనుమ – జనవరి 16 – సోమవారం
  2. శ్రీపంచమి – జనవరి 26 – గురువారం
  3. హజరత్ అలీ జయంతి – ఫిబ్రవరి 5 – ఆదివారం
  4. షబ్-ఇ-మిరాజ్ -‌ ఫిబ్రవరి 19 – ఆదివారం
  5. షబ్-ఇ-బారాత్‌ – మార్చి 8 – బుధవారం
  6. మహవీర్‌ జయంతి – ఏప్రిల్‌ 4 – మంగళవారం
  7. షాదత్‌ హజ్రత్‌ అలీ – ఏప్రిల్‌ 11 – మంగళవారం
  8. తమిళ నూతన సంవత్సరం – ఏప్రిల్ 14 – శుక్రవారం
  9. సాహిబ్-ఇ-ఖదీర్‌ – ఏప్రిల్ 18 – మంగళవారం
  10. బసవ జయంతి – ఏప్రిల్ 23 – ఆదివారం
  11. బుద్ధ పూర్ణిమ – మే 5 – శుక్రవారం
  12. రథయాత్ర – జూన్ ‌20 – మంగళవారం
  13. ఈద్ -ఏ-ఘాదిర్ – జులై 07 – శుక్రవారం
  14. 9 వ మొహర్రం – జూలై 28 – శుక్రవారం
  15. పార్శి నూతన సంవత్సరం – ఆగస్టు 16 – బుధవారం
  16. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 25 – శుక్రవారం
  17. రాఖీ పౌర్ణమి – ఆగస్టు 31 – గురువారం
  18. ఆర్బయీన్‌ – సెప్టెంబర్ 6 – బుధవారం
  19. దుర్గాష్టమి – అక్టోబర్ 22 – ఆదివారం
  20. మహర్నవమి – అక్టోబర్ 23 – సోమవారం
  21. యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌ – అక్టోబర్ 27 – శుక్రవారం
  22. నరక చతుర్దశి – నవంబర్ 11 – రెండో శనివారం
  23. సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహాది జయంతి – నవంబర్ 29 – బుధవారం
  24. క్రిస్మస్‌ ఈవ్ -‌ డిసెంబరు 24 – ఆదివారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eight =