టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై యువకులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

Minister KTR Appeals State Youth and Students Not To Worry About TSPSC Job Vacancies Recruitment,KTR Appeals State Youth and Students Not To Worry,Minister KTR About TSPSC,TSPSC Job Vacancies Recruitment,KTR on TSPSC Job Vacancies,Mango News,Mango News Telugu,BJP Forms Task Force on TSPSC,Telangana TSPSC Live News,TSPSC Question Paper Leak Case,TSPSC Paper Leak Scam,TSPSC Examinations Latest Updates,TSPSC Recruitment Latest Updates,Minister KTR Latest News and Updates

తెలంగాణ రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ మరొకసారి విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ కన్నా రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువత పట్ల తన నిబద్ధతను చాటుకున్నదన్నారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలన్న సమున్నతమైన ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక వ్యక్తి వలన జరిగిన దురదృష్టకరమైన సంఘటన బాధాకరమన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క ఆరోపణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీచేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమీషన్ యూపీఎస్సీతోపాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తిచేశారు.

ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. అయితే ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కుటిల రాజకీయ పార్టీల అసలు నైజాన్ని, మోసలి కన్నీరుని గుర్తించి చైతన్యంతో వ్యవహరించాలని విద్యార్థులకు, యువతకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా టీఎస్‌పీఎస్సీ అవసరమైన కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువత ప్రయోజనాలు కాపాడటం కోసం అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుందని, వారిపట్ల తమ నిబద్ధతను యువత గుర్తించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =