రాజాసింగ్ రాజ‌కీయాలు ఎటు?

Where is Rajasinghs politics,Rajasinghs politics,Where is Rajasingh,Mango News,Mango News Telugu,Rajasingh, bjp, mla raja singh, telangana politics, goshamahal,Raja Singh to be BJP candidate,Telangana polls,BJP likely to recall MLA Raja Singh,Rajasinghs politics Latest News,Rajasinghs politics Latest Updates,Rajasingh Latest News,Rajasingh Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Rajasingh, bjp, mla raja singh, telangana politics, goshamahal

గ్రేట‌ర్ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భ‌విత‌వ్యం ఇంకా ఎటూ తేల‌డం లేదు. తాజాగా వినాయ‌క ఉత్స‌వాల్లో రాజాసింగ్ పాట‌లు, ఫ్లెక్సీల‌తో ఆయ‌న అభిమానులు హ‌డావిడి చేశారు. అయితే.. ఆయ‌న రాజ‌కీయ అడుగులు ఎటా ఉండ‌నున్నాయ‌నేది ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే ఉంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి ఏడాది దాటినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాబోయే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామనీ చెప్పడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నామమాత్రంగా పర్యటిస్తున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలపై హైకమాండ్‌ ఆదేశాలు, మరోవైపు ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ సొంతంగా చేపడుతున్న కార్యక్రమాల కారణంగా ఎటువైపు ఉండాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు.

గోషామహల్‌ నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ సాధించాలని తహతహలాడుతున్నారు. ఏడాది గడిచినప్పటికీ ఆయనపై ఇంకా సస్పెన్షన్‌ ఎత్తివేసి పార్టీలోకి తీసుకోలేదు. పార్టీకి దూరమైనప్పటి నుంచి ఆయన చేసే ప్రకటనల్లో స్పష్ట్టత లేకపోవడంతో తన అభిమానుల్లో సైతం చులకనవుతున్నారు. పార్టీ తనకు టికెట్‌ కేటాయిస్తుందని, తానే పోటీలో ఉండబోతున్నానని కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సమయంలో.. తాను పోటీలో ఉండకూడదని ఇంటాబయటా కోరుకుంటున్నారని, ఇవే తనకు ఆఖరి అసెంబ్లీ సమావేశాలని చెప్పారు. ఒకవేళ అధిష్ఠానం తిరిగి పార్టీలోకి తీసుకోని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ హిందూ రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తానని తాజాగా మరో ప్రకటన చేశారు.

ఇదిలాఉండ‌గా.. మొదటినుంచి రాజాసింగ్‌ సంఘ్‌ (అర్‌ఎస్‌ఎస్‌, హిందూవాహిని)ను నమ్ముకున్నారనేది బహిరంగ సత్యం. అయితే సంఘ్‌లోని కొంతమంది పెద్దలపై కూడా ఆయన గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కొంతమంది ఎమ్మెల్యే అనుచరులే సంఘ్‌ పెద్దలకు అందించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. దాంతో రాజాసింగ్‌ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలను సాకుగా తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారనేది ఆయన సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు దూరం పెట్టారనేది స్పష్టత రావడంతో 6 నెలల క్రితమే పలు పార్టీల నేతలతో ఆయన చర్చలు జరిపారని చెబుతున్నారు. అయితే తాము మైనారిటీలకు దూరమవుతామనే భయంతో ఆ పార్టీలన్నీ రాజాసింగ్‌ను చేర్చుకునేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో బీజేపీ ఆహ్వానించే వరకు వేచి ఉంటానంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఒక‌వేళ ఆయ‌న‌ను బీజేపీలోకి తీసుకోకుండా, గోషామ‌హ‌ల్ టికెట్ ద‌క్క‌క‌పోతే ఆయ‌న ఏం చేస్తార‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా? లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =