బయో ఆసియా-2023: జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక యూనిట్‌ ఏర్పాటుపై జూబిలెంట్ భార్తియా గ్రూప్ ప్రకటన

Minister Ktr At Bioasia 2023 Jubilant Bhartia Group Announced To Establish State Of The Art Facility In Genome Valley, Minister Ktr At Bioasia 2023, Jubilant Bhartia Group Announcement, State Of The Art Facility In Genome Valley, State Of The Art Facility Establishment, Mango News, Mango News Telugu,Bioasia 2023 Hyderabad,Asian Biotech Companies,Bio Asia International 2023,Bio Asia International Conference 2023,Bio Asia Pacific 2023,Bioasia 2023,Bioasia 2023 Agenda,Bioasia 2023 Date,Bioasia 2023 Hyderabad Dates,Bioasia 2023 India,Bioasia 2023 Location,Bioasia 2023 Registration,Bioasia 2023 Website,Honorable Minister Ktr,Ktr Family,Ktr Personal Secretary Name,Ktr Phone Number,Ktr Son,Ktr Wife,Minister Ktr Office Address,Minister Ktr Phone Number,Minister Ktr Tweet,Minister Ktr Twitter,Telangana Minister Ktr,Telangana Minister Ktr Phone Number,Telangana Minister Ktr Tweet,Trs Minister Ktr

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో ఫిబ్రవరి 24 నుంచి బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు-2023 (20వ ఎడిషన్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్‌టెక్ ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. బయో ఆసియా-2023 సదస్సు సందర్భంగా పలు ఫార్మా, హెల్త్ కేర్ సంస్థలు తెలంగాణలో తమ సంస్థల యూనిట్స్ స్థాపన, విస్తరణపై ప్రకటన చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఫార్మా అండ్ లైఫ్ సైన్స్‌లో దిగ్గజ సంస్థ అయిన జూబిలెంట్ భార్తియా గ్రూప్, హైదరాబాద్‌ లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక యూనిట్‌ను (స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫెసిలిటీ) ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. బయో ఆసియా-2023 సదస్సులో జూబిలెంట్ భార్తియా, గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ కో-ఛైర్మన్ హరి ఎస్‌ భార్తియా, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ భేటీ అయిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. జూబిలెంట్‌ గ్రూప్‌ త్వరలో జీనోమ్‌ వ్యాలీలో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌ సీఈవో శక్తి నాగప్పన్‌ కూడా పాల్గొన్నారు.

మరోవైపు గ్లోబల్ హెల్త్‌కేర్ కంపెనీ సనోఫీ తన గ్లోబల్ మెడికల్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సనోఫీ సంస్థ ప్రతినిధుల బృందం శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అదేవిధంగా శుక్రవారం బయో ఆసియా సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్ ఇండియా మధ్య మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. యువత, విద్యార్థుల్లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్ షిప్ నైపుణ్యాలు పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. తెలంగాణ ప్రభుత్వం, యూనిసెఫ్ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్‌లో వై-హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్ షిప్‌పై వై-హబ్ దృష్టి సారించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =