పంజాబ్ చెస్ క్రీడాకారిణికి మాలిక హండకు మంత్రి కేటీఆర్ సాయం

Minister KTR Extends RS 15 Lakh Financial Assistance To Punjab Chess Player Malika Handa, Malika Handa Specially-abled chess champion, chess champion, Minister KTR, KTR, Punjab Chess Player Malika Handa, 15 Lakh Financial Assistance, KTR extends Rs 15L assistance chess champion, Minister Rama Rao extends support to international chess champion, international chess champion, 15 Lakh, TRS, TRS Party, TRS Party Live Updates, Mango News, Mango News Telugu,Minister KTR Extends Rs 15 Lakh Financial Assistance to Punjab Chess Player Malika Handa

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పంజాబ్ కు చెందిన మూగ బధిర చెస్ క్రీడాకారిణికి మాలిక హండకు మంత్రి కేటీఆర్ సోమవారం నాడు వ్యక్తిగతంగా 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా ఒక లాప్ టాప్ ను అందించి, ఆమెను సన్మానించారు. ముందుగా చెస్ లో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అనేక పతకాలు గెలిచినా, పంజాబ్ ప్రభుత్వం నుండి తనకు ఎలాంటి సహకారం అందడంలేదని మాలిక హండ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ సమయంలో మాలిక పోస్టుకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఆమె వివరాలు అందిస్తే తాను తన వ్యక్తిగత స్థాయిలో సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను పంజాబ్ లోని జలంధర్ నుంచి హైదరాబాద్ కు పిలిపించి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం చేశారు. అలాగే మాలికకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చూడాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కు మాలిక హండతో పాటుగా ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 9 =