పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకై ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Free Coaching Center in Peerzadiguda Municipal Corporation, KTR Inaugurates Free Coaching Center in Peerzadiguda Municipal Corporation, Peerzadiguda Municipal Corporation, Free Coaching Center in Peerzadiguda Municipal Corporation, Minister KTR, Free Coaching Center, Municipal Administration & Urban Development Minister KT Rama Rao, KT Rama Rao, Minister KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, Kalvakuntla Taraka Rama Rao, Minister KT Rama Rao inaugurated a free coaching center in Peerzadiguda Municipal Corporation, Minister KTR Inaugurating a Govt Free Coaching Center in Peerzadiguda Municipal Corporation, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ ను ఏర్పాటు చేశారు. సోమవారం నాడు ఈ ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుబాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న అభ్య‌ర్థుల‌కు పలు సూచనలు చేశారు. త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టే విధంగా భ‌విష్య‌త్‌ కు ప్ర‌ణాళికలు వేసుకోవాల‌ని అభ్యర్థులకు సూచించారు. ఓ 6 నెల‌లు సినిమాల‌కు దూరంగా ఉండమని, ఫోన్‌, యాప్స్ వాడకం, క్రికెట్ కూడా చూడడం కొంత తగ్గించి చ‌దువుపై దృష్టి సారించి మంచి ఫలితాలను సాధించాలని పేర్కొన్నారు. కాగా మొద‌టిసారిగా ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ ప్రారంభించిన ఘ‌న‌త మంత్రి మ‌ల్లారెడ్డికే ద‌క్కుతుంద‌ని చెప్పారు. కోచింగ్ సెంట‌ర్‌ లో సదుపాయాలు బాగున్నాయని, 3 నుంచి 4 నెల‌ల పాటు ఈ కోచింగ్ సెంట‌ర్ కొన‌సాగుతుందన్నారు. కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు ఇక్కడ మ‌ధ్యాహ్న భోజ‌నంతో పాటుగా స్నాక్స్ కూడా అందించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fourteen =