ఏపీ స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లేఖ, తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి

TDP MLA Ganta Srinivasa Rao Writes a Letter to AP Speaker For Approval of His Resignation, TDP MLA Ganta Srinivasa Rao, TDP MLA, Ganta Srinivasa Rao, TDP MLA Ganta Srinivasa Rao Resignation, Ganta Srinivasa Rao Resignation, TDP MLA Resignation, MLA Ganta Srinivasa Rao Resignation, AP Speaker, Tammineni Sitaram, AP Speaker Tammineni Sitaram, TDP MLA Ganta Srinivasa Rao Writes a Letter to AP Speaker Tammineni Sitaram For Approval of His Resignation, Resignation, MLA Resignation, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి తానూ చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా లేఖలో కోరారు. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 12, 2021న ఏక వాఖ్యంతో కూడిన తన రాజీనామా లేఖను స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పంపించినట్టు తెలిపారు. రాజీనామాను ఆమోదింపచేసుకునేందుకు వ్యక్తిగతంగా కూడా స్పీకర్‌ ను కలిశానని చెప్పారు.

అయితే ఏడాది దాటినా తన రాజీనామా ఇంకా ఆమోదానికి నోచుకోలేదని, ఏడాదికి పైగా కార్మిక సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నా అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ సీరియస్‌గా తీసుకోకపోవడం తనకు ఆవేదనను కలిగించిందని స్పీకర్ కు రాసిన లేఖలో గంటా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన రాజీనామాను ఆమోదించాలని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని, కార్మిక సోదరులకు నైతికంగా మద్ధతు ఇచ్చేందుకు తన రాజీనామా ఉపయోగపడుతుందని తాను గట్టిగా విశ్వసిస్తున్నానన్నారు. తన శాసన సభ్యత్వానికి చేసిన రాజీనామాను దయవుంచి ఆమోదిస్తారని మరోసారి కోరుతున్నానని స్పీకర్ కు రాసిన లేఖలో గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =