వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

YSRTP Chief YS Sharmila Gets Conditional Bail From Nampally Court in Police Assault Case,YSRTP Chief YS Sharmila Gets Conditional Bail,Conditional Bail From Nampally Court,Police Assault Case,Mango News,YS Sharmila Police Assault Case,YS Sharmila,YSRTP Chief YS Sharmila Latest News,YS Sharmila Chanchalguda Jail Latest News,Y.S. Sharmila booked for assault on police officers,YS Sharmila sent to 14 days remand,YSRTP Chief Cop Assault Case,Hyderabad court grants conditional bail,YSRTP Chief YS Sharmila Granted Bail,Assault on police official,YSRTP leader Sharmila arrested

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పోలీసులపై దాడి కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా వైఎస్ షర్మిల సోమవారం నాడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇరు వైపులా వాదనలు నడిచాయి. ఈ సందర్భంగా షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని, హైకోర్టు నిబంధనలను పోలీసులు పట్టించుకోవట్లేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ 6 నెలలు, మూడేళ్లలోపు జైలు శిక్ష పడేవేనని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే దీనికి కౌంటర్ గా పోలీసుల తరపు లాయర్‌ వాదిస్తూ పోలీసు విధులకు షర్మిల ఆటంకం కలిగించారని చెప్పారు. ఇక ఇప్పటికే షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఈ కేసులో ఇంకా సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలియజేశారు.

ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు చివరకు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలు పూచీకత్తు, ఇద్దరి వ్యక్తులతో జామీను సమర్పించాలని, అలాగే షర్మిల విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. కాగా సోమవారం.. టీఎస్‌‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులను కలిసేందుకు వెళ్ళడానికి సిద్దమైన షర్మిలను లోటస్ పాండ్ వద్ద నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె వారితో వాగ్యుద్ధానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైఎస్‌ షర్మిల.. ఓ ఎస్సై స్థాయి అధికారిపై చేయిచేసుకోగా, మరో మహిళా కానిస్టేబుల్‌ను చేత్తో నెట్టేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడటంతో చివరకు షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 3 =