నకిరేకల్ లో 100 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

100 Bedded Hospital, 100 Bedded Hospital in Nakrekal, Foundation Stone for Construction of 100 Bedded Hospital, KTR Laid Foundation Stone for Construction of 100 Bedded Hospital, Mango News, Minister for IT, Minister KTR, Minister KTR Laid Foundation Stone for Construction of 100 Bedded Hospital, Minister KTR Laid Foundation Stone for Construction of 100 Bedded Hospital in Nakrekal, Nakrekal, telangana, Telangana minister KTR slams Centre

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా నకిరేకల్ లో 100 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అలాగే నకిరేకల్ పట్టణంలో వెజ్ మార్కెట్ నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనతో చేయడంతో పాటుగా రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఇక నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం, భీమారం గ్రామంలో రైతు వేదిక మరియు పాఠశాల భవనాన్ని కూడా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

ముందుగా మంత్రి కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. కల్నల్ సంతోష్‌ బాబు ప్రథమవర్థంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు మరియు సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషార్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here